Site icon NTV Telugu

Mexico: 14ఏళ్ల బాలికకు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ..తర్వాత ఏమైందంటే..

Untitled Design

Untitled Design

మెక్సికోలో దారుణం జరిగింది. 14ఏళ్ల బాలికకు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ చేశారు. సర్జరీ చేసిన వారానికే బాలిక చనిపోవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని తండ్రి కార్లోస్ అరెల్లానో.. సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. 14ఏళ్ల పాలోమా నికోల్ అరెల్లానో ఎస్కోబెడోతో చనిపోయింది. మెక్సికోలో ఆమెకు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ చేసిన వారానికే బాలిక చనిపోయింది. దీంతో తండ్రి గుండెలు పగిలేలా రోదించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. పాలోమా తల్లి నిర్లక్ష్యం, ఆమె ప్రజెంట్ భర్త కారణంగానే ఇదంతా జరిగిందని.. ఈ ఆపరేషన్‌లో ఇంప్లాంట్స్ ఉపయోగించబడ్డాయని ఆరోపించాడు..

పర్ఫెక్ట్ ఫిజిక్ ఉండాలనే ఆలోచనతో పిల్లలు తప్పుడు దారులను ఎంచుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణ పాలోమా ఘటనే. ఇన్‌స్టా, టిక్ టాక్‌లో యాక్టివ్‌గా ఉండే పాలోమా ఓ ప్రైవేట్ క్లినిక్‌లో బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. తండ్రికి తెలియకుండానే ఇదంతా జరిగినట్లు సమాచారం. కాగా ముందుగా ఆమె మరణ ధృవీకకణ పత్రంలో వ్యాధితో చనిపోయిందని పేర్కొన్నారని.. మెదడు వాపు, మెదడుకు ఆక్సిజన్ సప్లయ్ తగ్గిపోవడం వల్ల చనిపోయిందని తేల్చారని చెప్పాడు ఆమె తండ్రి. కానీ ఈ సర్జరీ కారణంగా ఏర్పడ్డ శ్వాసకోశ సమస్యలు తన బిడ్డ మరణానికి కారణమని.. ఈ విషయాన్ని దాచి కవర్ చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఆయన.. క్లినిక్, వైద్యుడు, తల్లి, ఆమె రెండో భర్త కవర్ అప్‌కు బాధ్యులని.. దీనిపై పూర్తిగా సమాధానం కావాలని కోరాడు. ప్రస్తుతం అధికారికంగా విచారణ కొనసాగుతున్నట్లు మెక్సికన్ అథారిటీస్ ప్రకటించాయి.

Exit mobile version