NTV Telugu Site icon

Meta Layoffs: “నేను నా పిల్లలు అమెరికా వదిలి వెళ్లాలి”.. ఉద్యోగం ఊడిన ఇండియన్ ఆవేదన

Meta Layoffs

Meta Layoffs

Meta layoff.. Indians suffering: వరసగా టెక్ దిగ్గజాలు ఉద్యోగులకు షాక్ ల ఇస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, నెటిఫ్లిక్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకాయి. తాజాగా ఈ జాబితాలో ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా కూడా చేరింది. ఏకంగా 13 శాతం అంటే 11,000 ఉద్యోగులను తీసేస్తున్నట్లు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ సంస్థలో పనిచేస్తున్న పలువురు భారతీయులు ఉద్యోగాలు కూడా ఊడాయి. దీంతో ఉద్యోగులు తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

Read Also: Ramiz Raja: భారత ఆటగాళ్లపై వ్యంగ్యాస్త్రాలు.. బిలీయనీర్ ఆటగాళ్ల కంటే మా ఆటగాళ్లే నయం

తాజాగా మెటాలో ఉద్యోగం కోల్పోయిన రాజు కదమ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఉద్యోగంలో చేరిన 9 నెలలకే భారీ తొలగింపుల్లో ఉద్యోగం కోల్పోయాడు. తన ఇద్దరు కొడుకుల ఫోటోలను షేర్ చేస్తూ.. వారి జీవితాలు ప్రభావితం అవుతాయంటూ కామెంట్ చేశాడు. తాను అమెరికా వచ్చి 16 ఏళ్లు అవుతోందని.. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కూడా నా ఉద్యోగం పోలేదని.. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయానని అన్నారు. ఆయన పోస్టుపై సానుభూతి వ్యక్తం చేస్తూ పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మెటా తొలగించిన 11,000 ఉద్యోగుల్లో రాజు పేరు కూడా ఉంది. లింక్డ్‌ఇన్‌ తన బాధను పంచుకున్నారు. యూఎస్ఏ నుంచి బయలుదేరేందుకు నా గడియారం ప్రారంభం అయిందని.. నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే సహాయపడండి.. లేకుంటే నేను నా పిల్లలు యూఎస్ఏ వదిలి వెళ్లాలని పోస్ట్ చేశాడు. ఆయన కుమారులు యశ్, అర్జున్ ఫోటోలను షేర్ చేశారు. అంతకుముందు ఇలాగే వి. హిమాన్షు అనే వ్యక్తి ఉద్యోగం కోసం కెనడా వెళ్లిన రెండు రోజులకే మెటా ఉద్యోగం నుంచి తొలగించింది. ఇలాగే ఓ భారతీయ సంతతి మహిళ అన్నేకా పటేల్ ఉద్యోగం కూడా ఊడింది.