NTV Telugu Site icon

Russia: ఫలించిన బెలారస్ మధ్యవర్తిత్వం.. వెనక్కి తగ్గిన వాగ్నర్ గ్రూప్.. చల్లారిన తిరుగుబాటు..

Russia

Russia

Russia: రష్యాలో సంచలనం సృష్టించిన తిరుగుబాటు ఎట్టకేలకు చల్లబడింది. తిరుగుబాటు విషయంలో వాగ్నర్ గ్రూప్ మొత్తబడింది. మాస్కో వైపు తన దళాల్ని నడిపిస్తానంటూ శనివారం ప్రకటించిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. రష్యాలో రక్తపాతం నివారణకే ఇలా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రష్యాలో చెలరేగిన సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు రష్యా మిత్రదేశం బెలారస్ సహాయ పడింది. బెలారస్ మధ్యవర్తిత్వంతో వాగ్నర్ గ్రూప్, రష్యా ప్రభుత్వం మధ్య సయోధ్య కుదిరింది.

Read Also: Dalit Bandhu: రెండో విడత దళిత బంధుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..

ప్రిగోజిన్ పై రష్యా మోపిన తిరుగుబాటు సంబంధిత కేసుల్ని పుతిన్ ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది. అతనిపై క్రిమినల్ కేసును ఉపసంహరించుకుంటామని క్రెమ్లిన్ శనివారం తెలిపింది. మాస్కోలో సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా తన వాగ్నర్ దళాన్ని నడిపించిన నాయకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ బెలారస్ బయలుదేరి వెళతారని వెల్లడించింది. రక్తపాతం, అంతర్గత ఘర్షణల్ని నివారించడం అత్యున్నత లక్ష్యం అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు.

బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తితం వహించి ఇరు పక్షాల మధ్య ఒప్పందాన్ని కుదిర్చారు. వాగ్నర్ ఫైటర్లపై విచారణ జరగదని పెస్కోవ్ తెలిపారు. వారి వీరోచిత చర్యలను మేము ఎల్లప్పుడూ గౌరవిస్తామని ఆయన అన్నారు. వాగ్నర్ గ్రూప్ తన స్థావరాలకు తిరిగి వచ్చేలా ఒప్పందం కుదిరింది. తిరుగుబాటులో పాల్గొనని వారిని రష్యన్ సైన్యంలో చేరడానికి అనుమతించారు. రష్యాలో మిలిటరీ నాయకత్వాన్ని కూల్చేస్తానని ఏకంగా పుతిన్ శనివారం వార్నింగ్ ఇచ్చాడు ప్రిగోజిన్. దక్షిణ రష్యాలోని కీలకమైన రోస్తోవ్ నగరంలోని మిలిటరీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అక్కడి నుంచి మాస్కోకు తన సైన్యాన్ని నడిపిస్తానంటు హెచ్చరించారు. మరోవైపు పుతిన్ అంతే స్థాయిలు దేశాన్ని రక్షించుకునేందుకు ఎందాకైనా వెళ్తానని, తిరుగుబాటును కఠినంగా అణిచివేస్తానని వార్నింగ్ ఇచ్చారు.

Show comments