Site icon NTV Telugu

Mercedes-Benz: బ్రేక్‌లో సమస్య.. 10 లక్షల బెంజ్ కార్లు వెనక్కి

Benz

Benz

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెజ్ బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్.యు.వి సిరీస్‌లోని పలు కార్ల మోడళ్ళలో బ్రేక్ సిస్టమ్‌లో సమస్య ఉత్పన్నమైంది. దీంతో ఈ మోడళ్ళను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఆ ప్రకారంగా వివిధ మోడళ్ళకు చెందిన పది లక్షల కార్లు వెనక్కి తీసుకోనుంది.

2004 నుంచి 2015 వరకు తయారైన ఎస్‌యూవీ సిరీస్‌లోని ఎంఎల్‌, జీఎల్‌, ఆర్‌-క్లాస్‌ లగ్జరీ మినివ్యాన్‌ మోడళ్లలో బ్రేక్‌ పెడల్‌ తుప్పు పట్టిపోయాయని, దీంతో బ్రేకింగ్ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని గుర్తించామని పేర్కొన్నది. అందువల్ల ఈ మూడు మోడళ్లకు చెందిన పది లక్షల కార్లను వెనక్కి ఇచ్చేయాలని ఆయా కార్ల యజమానులకు సూచించామని, లోపాలను సరిచేసి తిరిగి ఇచ్చేస్తామని వెల్లడించింది. మొత్తం 9,93,407 కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో జర్మనీలోనే 70 వేల కార్లు ఉన్నాయని పేర్కొన్నది.

Up Chemical Factory: కెమికల్ ఫ్యాక్టర్ లో భారీ పేలుడు.. 12 మంది మృతి

Exit mobile version