Site icon NTV Telugu

G7 Summit: జీ 7 సమ్మిట్‌లో మెలోని-మాక్రాన్ గుసగుసలు.. వీడియో వైరల్

G7

G7

కెనడా వేదికగా జీ 7 సమ్మిట్ జరుగుతోంది. సమావేశంలో అగ్ర నేతలంతా రౌండ్ టేబుల్‌గా సమావేశం అయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరయ్యారు. నేతలంతా చర్చోపచర్చలు చేయడానికి సిద్ధపడుతున్న తరుణంలో పక్కపక్కనే కూర్చున్న ఇటలీ ప్రధాని మెలోని-ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గుసగుసలాడడం ప్రారంభించారు. ఏదో మేటర్ సీరియస్‌గా మాట్లాడుతున్నట్లుగా కలరింగ్ ఇచ్చారు. మాక్రాన్ నోటి దగ్గర చెయి అడ్డుపెట్టుకుని ఏదో చెబుతుంటే.. మెలోని సీరియస్‌గా ఆలకిస్తూ కళ్లు మూశారు. ఎదురుగా ట్రంప్ కూర్చుని ఉండగా ఇదంతా జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Ileana: ఏంటి.. ఇలియానా రెండో బిడ్డకు జ‌న్మనిచ్చిందా.. !

కెనడాలోని ఆల్బెర్టాలో 51వ జీ 7 శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. కెనడా ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు కలిగిన నాయకులంతా భేటీ అయ్యారు. వాణిజ్యం, భద్రత, సాంకేతికత సహా ప్రపంచ సమస్యలపై చర్చించడానికి సమావేశం అయ్యారు.

ఇది కూడా చదవండి: RajaSaab : యంగ్ హీరోయిన్ కెరీర్ ను ప్రభాస్ మలుపుతిప్పేనా..?

సోమవారం G7 రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభంకాగానే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో మాట్లాడడం ప్రారంభించారు. కళ్లు తిప్పికుంటూ మెలోని ఆలకించడం కనిపించింది. అయితే ఇద్దరు ఏ విషయాలు గురించి మాట్లాడుకున్నారో తెలియదు గానీ.. చాలా సేపు గుసగుసలాడారు. దౌత్యపరమైన సంభాషణను పక్కన పెట్టి అంత సీరియస్‌గా ఏం మాట్లాడుకున్నారో అర్థం కాక చెవులు కొరుకుతున్నారు. ఇక ఈ వీడియోలో ట్రంప్ కూర్చోగానే.. ఎవరో ఒక చీటి ఇచ్చి వెళ్లారు. ఈ సమావేశం తర్వాత ట్రంప్ హుటాహుటిన అమెరికాకు వెళ్లిపోయారు. మాక్రాన్-మెలోని వీడయోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మెలోని అద్భుతంగా ఉందని కామెంట్లు పెట్టారు.

 

 

Exit mobile version