NTV Telugu Site icon

Hindu Temple Attacked: హిందూ దేవాలయంపై దాడి.. ఖలిస్తాన్ మద్దతుదారుల దుశ్చర్య

Australia

Australia

Melbourne Hindu Temple Attacked By Khalistan Supporters: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఖలిస్తాన్ మద్దతుదారులు హిందూ ఆలయంపై దాడి చేశారు. భారత వ్యతిరేక నినాదాలను గోడలపై రాశారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న హిందూ సమాాజంలో ఆందోళన కలిగిస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఈ ఘటన జరిగింది. మిల్ పార్క్ శివారులోని ఉన్న బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్ గోడలపై గుర్తు తెలియన వ్యక్తులు ‘‘హిందూస్థాన్ ముర్దాబాద్’’ అంటూ గ్రాఫిటీతో భారత వ్యతిరేక నినాదాలు రాశారు.

Read Also: CM KCR: మహబూబాబాద్ పరిస్థితి చూసి కన్నీళ్ళు పెట్టుకున్నా

ఈ విద్వేషపూరిత చర్యలతో చాలా బాధపడ్డామని.. దిగ్భ్రాంతికి గురయ్యామని ఆలయ నిర్వాహకులు అన్నారు. గురువారం ఉదయం ఆలయానికి వెళ్లిన ఓ వ్యక్తి దీనిని గమనించారు. ఖలిస్తాన్ మద్దతుదారులు శాంతియుత హిందూ సమాజంపై మతపరమైన ద్వేషం ప్రదర్శించడంపై హిందువులు ఆందోళన, ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. ఖలిస్తాన్ దామ్‌దామి తక్సల్ నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను ప్రశంసిస్తూ ఆలయం గోడలపై రాశారు.

హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా విక్టోరియా రాష్ట్ర అధ్యక్షుడు మకరంద్ భగవత్ ఈ చర్యను ఖండించారు. దీనిపై ఆస్ట్రేలియా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రార్థనాస్థలాలపై ద్వేషం, విధ్వంసం ఆమోదయోగ్యం కానది.. ఇది విక్టోరియా రాష్ట్ర జాతి, మతసహన చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆయన అన్నారు. ఈ దాడిని బీజేపీ నాయకుడు మంజీందర్ సింగ్ సిర్సా ఖండించారు. ఖలిస్తానీ మద్దతుదారులే ఈ చర్యకు పాల్పడ్డారని అన్నారు. ఇలా చేయడానికి ఏ సిక్కు కూడా ధైర్యం చేయడని.. ఏ సిక్కు కూడా ఇలా ఆలోచించడని.. దీని వెనక ఉన్న వ్యక్తులను శిక్షించాలని.. ఇది సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. కెనడా, ఆస్ట్రేలియాల్లో జరుగుతున్న పరిణామాలపై ఆయేన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show comments