Site icon NTV Telugu

US: మెక్సికోను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన ఇళ్లు, వాహనాలు

Usfloods

Usfloods

అగ్ర రాజ్యం అమెరికాలో వరదలు బీభత్సం కొనసాగుతోంది. మొన్నటికి మొన్న టెక్సాస్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్దీ గల్లంతయ్యారు. ఈ వరదల నుంచి ఇంకా తేరుకోక ముందే.. ఇంకోవైపు మెక్సికోను భారీ వరదలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వర్షాలు కారణంగా వరదలు అమాంతంగా ముంచెత్తాయి. దీంతో ఇళ్లకు ఇళ్లే కొట్టుకుపోయాయి. అలాగే వాహనాలు, పెద్ద పెద్ద వృక్షాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ప్రస్తుతం అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇక ప్రవాహాంలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ప్రజలు గల్లంతయ్యారని మేయర్ లిన్ క్రాఫోర్డ్ వెల్లడించారు. రియో రుయిడోసో నది 20 అడుగుల ఎత్తు కంటే ఎత్తుగా ప్రవహిస్తోంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వరదల్లో ఇళ్లులు కొట్టుకుపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి: Trump Tariffs: బ్రెజిల్ సహా మరో 7 దేశాలపై భారీగా సుంకాలు.. పోర్చుగీస్పై మాత్రం 50 శాతం టారీఫ్స్!

ఇదిలా ఉంటే గత వారం టెక్సాస్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు కారణంగా ఇప్పటి వరకు 109 మంది చనిపోయారు. మరో 160 మంది ఆచూకీ లభించడం లేదని అధికారులు తెలిపారు. జూన్ 4న తెల్లవారుజామున వచ్చిన ఆకస్మిక వరదలు కారణంగా కుటుంబాలకు కుటుంబాలే కొట్టుకుపోయాయని అధికారులు పేర్కొ్న్నారు. ఇక వేసవి శిబిరాలకు వెళ్లిన వారి ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పారు.

ఇది కూడా చదవండి: Chiru157 : మెగా – అనిల్ నాన్ – థియేట్రికల్ రికవరి కాస్త రిస్కే

 

Exit mobile version