Massive Fire In Pakistan’s Islamabad: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపుగా 300 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇస్లామాబాద్ లోని ప్రముఖ సండే బజార్ లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో దుకాణాలు, స్టాళ్లు అగ్నికి దగ్ధమయ్యాయి. సెకండ్ హ్యాండ్ బట్టలు, కార్పెట్లను విక్రయించే బజాల్ లోని గేట్ నంబర్ 7 సమీపంలో మంటలు ప్రారంభం అయ్యాయి. భారీగా ఎగిసిపడిన మంటలను ఆర్పేందుకు 10 ఫైర్ ఇంజన్లు గంటల తరబడి శ్రమించాయి. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన సిబ్బంది సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ప్రాణనష్టంపై సమాచారం రాలేదు.
Read Also: Madhya Pradesh: పెళ్లి కూతురు మేకప్ పాడుచేసినందుకు బ్యూటీషియన్ అరెస్ట్..
వేగంగా మంటలు చుట్టుముట్టడంతో దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనపై అంతర్గం వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా కాన్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సండే బజార్ వైపు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు బ్లాక్ చేశారు. ఇస్లామాబాద్-శ్రీనగర్ హైవేని ఫ్రీగా ఉంచాలని.. ప్రజలు రెస్క్యూ సిబ్బందికి సహకరించాలని కోరారు.
నగరంలోని జి-9 ప్రాంతంలో ఉన్న ఈ జజార్ లో గతంలో కూడా అగ్ని ప్రమాదాలు సంభవించాయి. 2019 అక్టోబర్ లో జరిగిన ప్రమాదంలో 300 దుకాణాలు కాలిపోయాయి. అంతకుముందు 2018 జూలైలో కూడా దుస్తుల షాపులో మంటలు చెలరేగి 90 షాపులు, స్టాళ్లు దగ్దమయ్యాయి. 2017 ఆగస్లులో బ్యాటరీ పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం, శుక్ర, ఆదివారాల్లో ఈ బజార్ నిర్వహిస్తారు. తక్కువ ధరలకు వస్తువులు, బట్టలు వస్తుండటంతో విపరీతంగా రద్దీ నెలకొంటుంది.