Site icon NTV Telugu

Massive explosion: ఫైవ్​స్టార్​హోటల్‌లో భారీ పేలుడు..

Blast

Blast

గ్యాస్‌ లీకై ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో భారీ పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతిచెందినట్టుగా తెలుస్తోంది… క్యూబా రాజధాని హవానాలో ఈ ఘటన జరిగింది… సరటోగా పిలిచే అతి పురాతణమైన ఫైవ్​స్టార్​హోటల్లో ఈ ప్రమాదం జరిగింది.. మరో 50 మందికిపైగా గాయపడినట్టుగా తెలుస్తుండగా.. దాదాపు 13 మంది ఆచూకీ దొరకడం లేదని చెబుతున్నారు.. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది రెస్క్యూటీమ్‌.. ఈ ప్రమాదానికి గ్యాస్​లీకేజీ కారణంగా చెబుతున్నారు.. ఈ భారీ పేలుడు ధాటికి హోటల్‌తో పాటు.. హోటల్‌ బయట ఉన్న బస్సులు, కార్లు.. పక్కనే ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నట్టు చెబుతున్నారు.

Read Also: TSRTC: మాతృ‌ది‌నో‌త్సవా‌నికి ఆర్టీసీ కానుక.. తల్లులందరికీ ఉచిత ప్రయాణం

Exit mobile version