Site icon NTV Telugu

Earthquake: 800కు చేరిన ఆప్ఘనిస్థాన్ భూకంప మృతుల సంఖ్య.. 2,500 మందికి తీవ్రగాయాలు

Earthquake2

Earthquake2

ఆప్ఘనిస్థాన్‌ను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. అర్ధరాత్రి వచ్చిన భూకంపంతో తాలిబన్ల దేశం వణికిపోయింది. రిక్టర్ స్కేల్‌పై 6.0తో భూకంపం వచ్చింది. దీంతో ఎటుచూసినా శవాల దిబ్బగా మారిపోయింది. ఇప్పటి వరకు 800 మంది చనిపోగా.. 2,500 మందికి తీవ్రగాయాలు అయినట్లు ఆప్ఘనిస్థాన్ మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి.

ఇది కూడా చదవండి: SCO Summit: ట్రెండింగ్‌గా మారిన ఐదు ఫొటోలు.. ఏవేవంటే..!

యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1, 2025 రాత్రి 11.47గంటలకు హిందూ కుష్ పర్వత ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. గంట వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించినట్లు సమాచారం. ఆప్ఘనిస్థాన్‌లోని కునార్‌, నోరిస్థాన్‌, నంగర్హార్‌ ప్రావిన్స్‌లు బాగా తీవ్రంగా నష్టపోయాయి. పలు ఇళ్లులు నేలకూలిపోయాయి. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. ఇక గూడు లేక అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇక బాధితులకు సహాయ చేసేంత సామర్థ్యం ఆప్ఘనిస్థాన్ దగ్గర లేదు. దీంతో సాయం కోసం ఎదురుచూస్తోంది.

 

Exit mobile version