Site icon NTV Telugu

బీభత్సం : ఆఫ్రికాలో భారీ పేలుడు.. 91 మంది మృతి

ఆఫ్రికా దేశంలోని సియర్రా లియోన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 91 మంది మృతి చెందగా 100 మంది గాయాలయ్యాయి. సియర్రా లియోన్‌లోని ఫ్రీటౌన్‌లో ఓ లారీని చమురు ట్యాంకర్‌ ఢీ కొట్టింది. దీంతో ఆ వాహనాలను అక్కడే ఉంచారు. చమురు ట్యాంకర్‌ నుంచి చమురు లీక్‌ అవుతుండడంతో చమురు కోసం స్థానిక జనాలు ఎగబడ్డారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా చమురు ట్యాంకర్‌లో మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది.

దీంతో 91 మంది మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. మృతి చెందిన వారి మృతదేహాలు కూడా చెల్లచెదురుగా పడిపోయాయి గుర్తుపట్టడానికి వీళులేకుండా ఉన్నాయి. అంతేకాకుండా సుమారు మరో 100 మంది తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని షాపులపై ఆగ్నికీలలు ఎగిసిపడడంతో మంటలు వ్యాపించాయి.

Exit mobile version