Site icon NTV Telugu

Mars: అంగారకుడిపై అరుదైన శిలలను గుర్తించిన పర్సెవరెన్స్ రోవర్..

Mars Planet

Mars Planet

Perseverance Rover Discovers Rocks Shaped By Water On Mars: సౌరమండలంలో భూమి తరువాత నివాసయోగ్యంగా ఉండే గ్రహం ఏదైనా ఉందంటే అది అంగారకుడే అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో మార్స్ పై కాలనీలు ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతోంది స్పెస్ ఎక్స్ వంటి అంతరిక్ష సంస్థ. ఇప్పటికీ అంగారకుడి ధృవాల వద్ద మంచురూపంలో నీరు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఒకప్పుడు నీటితో నిండి ఉన్న అరుణ గ్రహంపై పరిశోధనలు చేయడానికి నాసాతో పాటు పలు అంతరిక్ష సంస్థలు ఆర్బిటర్లను పంపించాయి. అంగారకుడిపై అన్వేషణలో అందరి కన్నా ముందుంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. నాసా ఇప్పటికే క్యూరియాసిటీ, ఆపర్చునిటీ వంటి రోవర్లను మార్స్ పైకి పంపింది. 2021లో అంగారుకుడిపై పరిశోధనల కోసం పర్సెవరెన్స్ రోవర్ ను అరుణ గ్రహంపైకి పంపింది నాసా.

ఇదిలా ఉంటే అంగారకుడిపై పరిశోధనలు చేస్తోంది పర్సెవరెన్స్ రోవర్. తాజాగా అంగారకుడిపై అరుదైన విషయాన్ని గుర్తించింది. ఒకప్పుడు అంగారకుడిపై నీటి ప్రవాహాలు, నదులు, సముద్రాలతో నిండి ఉండేది అనేందుకు మరో బలమైన సాక్ష్యం లభించింది. నీటి ప్రవాహాల వల్ల రూపు మార్చుకున్న శిలలను పర్సెవరెన్స్ రోవర్ గుర్తించింది. దీంతో ఒకప్పుడు అంగారుకుడిపై కూడా భూమిలాగే నీరు ఉండేది అనేందుకు బలమైన రుజువు లభించింది. పర్సెవరెన్స్ రోవర్ ప్రస్తుతం అంగారకుడిపై జెజెరో బిలం వద్ద పరిశోధనలు జరుపుతోంది.

Read Also: GHMC Worker Killed: జీహెచ్ఎంసీ కార్మికురాలిని హత్య చేసిన దుండగులు

జెజెరో బిలం ఒకప్పుడు నీటితో కూడిన సరస్సును కలిగి ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడ జీవానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండే అవకాశం ఉంది. దాదాపుగా 45 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ బిలం ఇసిడిస్ ప్లానిషియా అనే పశ్చిమ ప్రాంతంలో ఉంది. మార్స్ భూమధ్య రేఖకు కొద్ధిగా ఉత్తరాన ఈ ప్రాంతం ఉంది. నాసాకు సంబంధించిన మరో రోవర్ క్యూరియాసిటీ ఉన్న ప్రాంతానికి దాదాపుగా 3700 కిలోమీటర్ల దూరంలో పర్సెవరెన్స్ పరిశోధనలు సాగిస్తోంది. జెజెరో క్రేటర్లో రెండు వేర్వేరు రకాలైన ఇగ్నియస్ శిలలు లభించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.

Exit mobile version