ఆఫీస్ అంటే ఒక సిస్టం.. ఒక పద్ధతి.. కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరి హద్దుల్లో వారుండి ఉద్యోగులు పని చేసుకోవాలి. అంతేకాని ఆఫీస్‌లో తమ ఇష్టప్రకారం నడుచుకుంటామంటే ఏ కంపెనీ ఊరుకోదు. అలాంటిది వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంట ఆఫీసులోనే జుగుప్సాకరంగా ప్రవర్తించారు. బహిరంగంగానే శృంగార కార్యకలాపాలకు పూనుకున్నారు. ఈ యవ్వారం కంపెనీ దృష్టికి వెళ్లడంతో ఇద్దరిని తొలగించింది. జంట అంతటితో ఆగకుండా కంపెనీపై దావాకు వెళ్లింది. చివరికి న్యాయస్థానం మొట్టికాయలు వేయడంతో కిమ్మనకుండా ఉన్నారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Sai Dharam Tej: మంత్రి నారా లోకేష్‌ను కలిసిన హీరో సాయి ధరమ్ తేజ్.. రూ.10 లక్షలు విరాళం
లియు, చెన్ అనే ఉద్యోగులు స్యూ కంపెనీలో పని చేస్తున్నారు. ఇద్దరూ నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఒకే విభాగంలో పనిచేస్తున్నారు. ఇద్దరికి గతంలోనే వివాహాలు అయ్యాయి. కానీ కార్యాలయంలో ఇద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఆఫీస్‌లోనే క్లోజ్‌గా ఉండడం.. మరో అడుగు ముందుకేసి అందరూ చూస్తుండగా బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం సహోద్యోగులకు కూడా విసుగు తెప్పించింది. ఇక వీళ్లిద్దరి వ్యవహారం ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా తెలిసింది. లియు భార్య మొబైల్ చెక్ చేయగా.. చాటింగ్ రికార్డులు కనిపించాయి. ‘‘ఐ లవ్ యు’’ మరియు ‘‘నేను నిన్ను ఎల్లవేళలా చూడాలనుకుంటున్నాను’’ వంటి సందేశాలు కనిపించాయి. దీంతో ఈ సందేశాలను లియు భార్య కంపెనీ మేనేజ్‌మెంట్‌కు 2020లో ఫార్వడ్ చేసింది. ఇక చెన్ భర్త కూడా ఆఫీస్‌లో వివాహేతర సంబంధం విషయం తెలుసుకుని కంపెనీకి నేరుగా వెళ్లి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా కూడా లియు, చెన్‌ల మధ్య ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇద్దరూ శృంగార కార్యకలాపాల్లో జరిగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా సహోద్యోగులు కూడా ఈ యవ్వారంతో ఇబ్బందులకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఏమైంది..? విదేశాల్లో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు..?
ఇక లియు, చెన్ వ్యవహారంతో విసుగెత్తిపోయిన స్యూ కంపెనీ ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించింది. దీంతో వారిద్దరూ కంపెనీపై దావా వేశారు. ఇద్దరు వేర్వేరుగా పాత యాజమానిపై వ్యాజ్యాలను దాఖలు చేశారు. చెన్ 26,000 యువాన్ల (సుమారు రూ. 3 లక్షలు) నష్టపరిహారాన్ని కోరగా.. సీనియర్ పదవిలో ఉన్న లియు 230,000 యువాన్లు (సుమారు రూ. 27 లక్షలు) నష్టపరిహారం కోరాడు. లియు, చెన్ దాఖలు చేసిన వ్యాజ్యాలను తాజాగా న్యాయస్థానం కొట్టేసింది. కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇద్దరి చర్యలను తప్పుపట్టింది.
ఇందుకు సంబంధించిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జంటపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా కంపెనీపై దావా వేయడం సిగ్గు చేటు విషయమని మరొకరు వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Crime: పాత బాయ్ ఫ్రెండ్ తిరిగి రావడంతో.. కొత్త స్నేహితుడైన ఎస్సైని హత్య చేసిన మహిళా కానిస్టేబుల్..