Site icon NTV Telugu

US: టెక్సాస్‌లో కాల్పులు.. ముగ్గురు సహోద్యోగుల్ని కాల్చి చంపి నిందితుడు ఆత్మహత్య

Usfire

Usfire

అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలోని ల్యాండ్‌స్కేప్ సరఫరా కంపెనీలో 21 ఏళ్ల యువకుడు తుపాకీతో చెలరేగిపోయాడు. ముగ్గురు సహోద్యోగులను కాల్చి చంపి.. అనంతరం తుపాకీతో కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి: Trump-BBC: ట్రంప్ ప్రసంగం ఎడిట్‌పై ఇక్కట్లు.. బీబీసీ డైరెక్టర్, సీఈవో రాజీనామా

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ముగ్గురు సహోద్యోగుల్ని కాల్చి చంపి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆ ఘటన జరిగినట్లుగా చెప్పారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉందని నిర్ధారించారు. కాల్పుల తర్వాత ఉద్యోగులంతా సంఘటనాస్థలి నుంచి పారిపోయారని పేర్కొన్నారు. నిందితుడు జోస్ హెర్నాండెజ్ గాలో(21)గా పోలీసులు గుర్తించారు. కాల్పుల వెనుక ఉన్న కారణాన్ని మాత్రం ఇంకా అధికారులు వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: Mohan Bhagwat: పాకిస్థాన్‌కు నష్టం కలిగేలా భారత్‌ ఓడించాలి..

Exit mobile version