NTV Telugu Site icon

Afghanistan: ఆఫ్ఘన్‌లో మహిళా విద్యార్థుల నిరసన.. తరగతులు బహిష్కరించిన విద్యార్థులు

Afghanistan

Afghanistan

Male Afghan Students Boycott Classes, Protest Women’s Education Ban: మహిళా విద్యార్థులు యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించకుండా తాలిబాన్ పాలకులు బ్యాన్ విధించారు. దీనిపై పెద్ద ఎత్తున విద్యార్థినులు నిరసన తెలుపుతున్నారు. యూనివర్సిటీ గేట్ల ముందు విలపిస్తూ యువతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీని కన్నా తమ తలలు నరకడం మంచిదని అమ్మాయిలు అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ లో జంతువులకు ఉన్న స్వేచ్ఛ మహిళలకు లేదని.. కుక్క కూడా వీధుల్లో తిరుగుతుంది కానీ..అమ్మాయి ఇళ్లకే పరిమితం అవుతున్నారంటూ తాలిబాన్ పాలకులపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నారు.

Read Also: BIG Breaking: విప్రో సర్కిల్‌ వద్ద టిప్పర్‌ లారీ బీభత్సం.. కార్లు, బైక్‌లపై దూసుకెళ్లడంతో..

ఇదిలా ఉంటే మహిళా విద్యార్థినుల బ్యాన్ పై అక్కడి మిగతా విద్యార్థులు స్పందించారు. వారికి మద్దతుగా మగ విద్యార్థులు ఆదివారం తగరగతులు బహిష్కరించారు. మహిళా విద్యార్థులపై బహిష్కరణ తొలగించే వరకు తాము కూడా తరగతులకు హాజరుకామని విద్యార్థులు చెబుతున్నారు. కాబూల్ విశ్వవిద్యాలయంలో అనేక మంది లెక్చలర్లు ఈ నిర్ణయాన్ని పున:పరిశీలించాల్సింగా తాలిబాన్లను కోరారు.

గతేడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ ప్రజాప్రభుత్వాన్ని కూల్చి తాలిబాన్లు అధికారాన్ని చేపట్టారు. వచ్చీరాగానే మహిళ స్వేచ్ఛపై పలు ఆంక్షలు విధించారు. మహిళలు పనులు చేయకుండా, చదువుకోకుండా నిషేధాన్ని విధించారు. కేవలం వంటిళ్లకే పరిమితం అయ్యేలా తీవ్ర ఆంక్షలు పెట్టారు. చివరకు మార్కెట్ వెళ్లాలన్నా.. ఇంటిలోని మగవారిని తోడు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచదేశాలు వ్యతిరేకిస్తున్నా.. తాలిబాన్ల తీరు మారడం లేదు. ఇక దేశంలో పేదరికం పెరిగిపోతోంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కు పలు ఎన్జీవోలు సేవ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు దేశ, విదేశ ఎన్జీవోల్లో మహిళలు పనిచేయడాన్ని బ్యాన్ చేసింది తాలిబాన్ ప్రభుత్వం. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.