Site icon NTV Telugu

Maldives: మాది చిన్న దేశం, భారత్‌తో శత్రుత్వం పెంచుకోం..మాల్దీవుల అధ్యక్షుడు..

Mohamed Muizzu

Mohamed Muizzu

Maldives: మాల్దీవులకు మహ్మద్ ముయిజ్జు ప్రెసిడెంట్ కాబోతున్నారు. భారత వ్యతిరేక హమీలతో ఆయన అక్కడి ప్రజల నుంచి ఓట్లు సంపాదించారు. ఇందులో ముఖ్యంగా మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను పంపించేస్తానని ఎన్నికల హమీ ఇచ్చారు. గతంలో ప్రెసిడెంట్‌గా ఉన్న ఇబ్రహీం సోలీహ్ భారత అనుకూలంగా వ్యవహరించారు.

ఇదిలా ఉంటే తమది చిన్న దేశమని, ఎవరితో శత్రుత్వం పెట్టుకోమని, భౌగోళిక రాజకీయ శత్రుత్వంలో చిక్కుకోమని అన్నారు. మాల్దీవుల విదేశాంగ విధానాన్ని ఇందులో నిమగ్నం చేయడంపై పెద్దగా ఆసక్తి లేదని అన్నారు. మాల్దీవులు భారత్, చైనాతో కలిసి పనిచేయబోతోందని ఆయన తెలిపారు. ఏఎఫ్‌పీ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖలు చేశారు.

Read Also: Shehla Rashid: “కాశ్మీర్ గాజా కాదు”.. ప్రధాని మోదీపై జేఎన్‌యూ మాజీ స్టూడెంట్ లీడర్ ప్రశంసలు..

శుక్రవారం ముయిజ్జూ మాల్దీవులకు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మేము భారత్, చైనాతో పాటు అన్ని దేశాలతో కలిసి పనిచేయబోతున్నామని తెలిపారు. అక్టోబర్ నెలలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ దేశంలో భారత సైనికుల ఉనికిని తొలగించేందుకు భారత్ తో చర్చలు ప్రారంభించినట్లు తెలిపారు.

మాల్దీవుల్లో దాదాపుగా 70 మంది భారత సైనికులు, ఇండియా స్పాన్సర్ చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాలను నిర్వహిస్తున్నారు. భారత యుద్ధనౌకలు మాల్దీవుల్లోని ప్రత్యేక ఆర్థిక జోన్ లో పెట్రోలింగ్‌కి సహాయపడుతున్నాయి. అయితే తాము చైనా సైనికులను కూడా అనుమతించేది లేదని ముయిజ్జు స్పష్టం చేశారు.

Exit mobile version