NTV Telugu Site icon

Sydney: సిడ్నీలో ఘోర అగ్నిప్రమాదం.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం

Sydney

Sydney

Sydney: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. 7 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భవనంలో భారీ ఎత్తున మంటుల చెలరేగాయి. భారీ మంటల కారణంగా భవనం కుప్పకూలింది. బుధవారం సాయంత్రం 4 గంటలక ప్రాంతలో సర్సీ హిల్స్ లోని ఏడంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ముందుగా మూడో అంతస్తులో అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి, క్షణాల్లో ఇవి అన్ని అంతస్తులకు అంటుకున్నాయి. మంటల ధాటికి చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రెస్క్యూ చర్యలను చెపట్టారు. 100 మంది అగ్నిమాపక సిబ్బంది, 20 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read Also: Software Employee Suicide: శివాలయంలో ఉరేసుకుని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

ఇదిలా ఉంటే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో భవనం ముందున్న కారుతో పాటు ఇతర భవనాలకు మంటలు వ్యాపించినట్లు తెలిపారు. మంటల ధాటికి భవనం పూర్తిగా కాలిపోయింది. అగ్నిప్రమాదం జరిగిన భవనం గత కొంత కాలంగా ఖాళీగా ఉంటడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే సిడ్నీలోని అత్యంత రద్దీ అయిన రైల్వే స్టేషన్ ఉంది.