Site icon NTV Telugu

Mahindra Udo: మహీంద్రా ఉడో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా.. తక్కువ ధరతో ఏకంగా 200 కి.మీ రేంజ్..

Mahindra Udo

Mahindra Udo

Mahindra Udo: మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ తన త్రీ-వీలర్ ఆటోరిక్షా ‘‘ఉడో’’ను లాంచ్ చేసింది. రూ. 3,58,999 పరిచయ ధరతో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 3,84,299 కన్నా తక్కువ. విమనాం ప్రేరణతో ఈ ఆటోరిక్షాను డిజైన్ చేసినట్లు సంస్థ చెబుతోంది. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా ఫుల్ మోనోకోక్ నిర్మాణం దీని ప్రత్యేకత. ప్రతాప్ బోస్ దీనిని డిజైన్ చేశారు. బోల్డ్ హెడ్ ల్యాంప్స్, వెడల్పైన విండ్ షీల్డ్ ఉన్నాయి. డ్రైవింగ్ మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు డ్రైవర్ల కోసం 20 శాతం మందంగా ఉండే ‘‘ఫైలట్ సీట్’’ ఇందులో ఉంది.

Read Also: Aarava Sridhar controversy: అరవ శ్రీధర్ వ్యవహారంపై బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు.. పవన్‌ కల్యాణ్‌ పరువు తీస్తున్నారు..!

ప్రయాణికుల కోసం తగినంత హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ ఇచ్చారు. స్టైలిష్ సీటింగ్ అందించారు. ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్, డ్యుయల్-ఫోర్క్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను ఇస్తున్నారు. దీని వల్ల గతుకల రోడ్లపై కూడా బెటర్ రైడ్ క్వాలిటీని అందిస్తుంది. రీజనరేటివ్ బ్రేకింగ్, సెగ్మెంట్‌లోనే తొలిసారిగా రివర్స్ థ్రోటిల్, హిల్ హోల్డ్, క్రీప్ మోడ్ వంటివి అందించారు.

11.7 kWh లిథియం అయాన్ బ్యాటరీ కలిగిన ఉడో 10 kW పీక్ పవర్, 52 Nm టార్క్ అందిస్తుంది. ఒక్క ఛార్జ్‌తో 265 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతుంది, రియల్‌గా 200 కి.మీ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇది రేంజ్, రైడ్, రేస్ మోడ్‌‌లను కలిగి ఉంటుంది. రేస్ మోడ్‌లో గంటలకు 55 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.

Exit mobile version