జపాన్ తూర్పు నోడా ప్రాంతం తీరంలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం 19.3 కి.మీ లోతులో సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఇటీవల 7.5 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. అనేక ప్రాంతాలను కుదిపేసింది. అప్పుడు 30 మంది గాయపడ్డారు. 90,000 మంది నివాసితులు తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు 6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
