Site icon NTV Telugu

Earthquake: ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం.. ఏడుగురు మృతి

Earthquake2

Earthquake2

ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం హడలెత్తించింది. సోమవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన మజార్-ఎ షరీఫ్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మజార్-ఎ షరీఫ్ సమీపంలో 28 కి.మీ (17.4 మైళ్లు) లోతులో భూకంపం సంభవించిందని పేర్కొంది. ప్రాణనష్టం భయంతో జియోలాజికల్ సర్వే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏడుగురు మృతి.. 150 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూప్రకంపనలకు ఇళ్లులు ఊగిపోయాయి.

ఇది కూడా చదవండి: Womens World Cup 2025 : భారత్ విజయ దుందుభి.. సాధించార్రా మనోళ్లు..

మజార్-ఎ షరీఫ్‌లో దాదాపు 5,23,000 జనాభా ఉన్నారు.  ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఓ వైపు పాకిస్థాన్‌తో జరుగుతున్న ఉద్రిక్తతలు కారణంగా అనేక మంది ప్రాణాలు పోతున్నాయి. దీనికి తోడుగా భూప్రకంపనలు రావడంతో ఆప్ఘనిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆగస్టులో సంభవించిన భూకంపం కారణంగా 1,000 మందికి పైగా మరణించారు. ఆ ప్రాంతంలో పని చేస్తున్న ఆప్ఘన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది.

ఇది కూడా చదవండి: BSNL: బీఎస్ఎన్ఎల్ 50 రోజుల ప్లాన్.. రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్‌

Exit mobile version