Site icon NTV Telugu

Luxury Ship: ప్రారంభించిన నిమిషాల్లోనే మునిగిపోయిన లగ్జరీ నౌక.. వీడియో వైరల్

Ship

Ship

ఉత్తర టర్కీ తీరంలో ఒక కొత్త లగ్జరీ నౌక సముద్రంలో మేునిగిపోయింది. ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే నీట మునిగింది. దీంతో దాని యజమాని సముద్రంలోకి దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Stock Market: జీఎస్టీ ఊరటతో స్టాక్ మార్కెట్‌కు ఉత్సాహం.. భారీ లాభాల్లో సూచీలు

1 మిలియన్ డాలర్లతో లగ్జరీ నౌకను నిర్మించారు. టర్కీలోని మెడ్ యిల్మాజ్ షిప్‌యార్డ్‌లో మంగళవారం నౌక్‌ను ప్రారంభించారు. కొంత మంది ప్రయాణికులు, సిబ్బందితో నౌక ప్రయాణం ప్రారంభమైంది. ప్రారంభమైన 15 నిమిషాలకే ఈ నౌక సముద్రంలో మునిగిపోయింది. భయాందోళనకు గురైన ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకేశారు. అనంతరం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. యజమాని, కెప్టెన్‌ కూడా సముద్రంలో దూకి ఒడ్డుకు చేరుకున్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Trump: భారత్‌పై మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. మరిన్ని దశలు ఉన్నాయని హెచ్చరిక

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఈ నౌక ఇస్లాంబుల్ నుంచి యజమానికి డెలివరీ అయింది. అయితే ప్రారంభించిన నిమిషాల్లోనే మునిగిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది ఏఐ వీడియో అనుకుంటా? అని ఒకరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇంత ఖరీదైన నౌక ఎలా మునిగిపోయిందో చెప్పగలరు? అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.

 

Exit mobile version