Site icon NTV Telugu

US: అమెరికాలో బస్సు హైజాక్.. కొనసాగుతున్న ఉత్కంఠ

Usbus

Usbus

అగ్ర రాజ్యం అమెరికాలో బస్సు హైజాక్ తీవ్ర కలకలం రేపుతోంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఒక దుండగులు హైజాక్ చేసినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. బస్సును చుట్టుముట్టినట్లుగా సమాచారం. అయితే బస్సులో ప్రయాణికులు ఎంత మంది ఉన్నారు. అలాగే హైజాకర్స్ ఎంత మంది ఉన్నారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది.

ఇది కూడా చదవండి: Vettaiyan-The Hunter: ‘వేట్టయన్’ ర‌జినీకాంత్‌ దిగాడు.. అంచనాలు రేపుతున్న ప్రివ్యూ వీడియో

లాస్ ఏంజిల్స్‌లోని 6వ స్ట్రీట్, సౌత్‌ అలమెడా స్ట్రీట్ సమీపంలో బస్సును హైజాక్‌ చేసి.. ప్రయాణికుల్ని బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తు్నారు. ప్రస్తుతం బస్సులో డ్రైవర్, ప్రయాణికులు, హైజాకర్స్ ఉన్నట్లు మీడియా కథనాలు తెలుపుతున్నాయి. హైజాకర్స్.. 48 ఏళ్ల వ్యక్తిని కాల్చి వేసినట్లుగా తెలుస్తోంది. బస్సును తమ అధీనంలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Actor Arrested: రేప్ కేసులో మరో నటుడు అరెస్ట్

మరోవైపు హైజాకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గంటపాటు వెంబడించి పట్టుకున్నట్లు తెలుస్తోంది. గాయపడిన ప్రయాణికుడిని పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Tamil Nadu: 17 రోజులుగా.. “శాంసంగ్‌” ఉద్యోగుల సమ్మె.. ఎందుకో తెలుసా?

Exit mobile version