NTV Telugu Site icon

Live: ఉక్రెయిన్-రష్యా చర్చలు ప్రారంభం

రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. బెలారస్​లో ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు చర్చలు జరుపుతున్నారు. ఇదిలా వుంటే ఉక్రెయిన్​పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపకపోతే 70 లక్షల మంది వలస వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని ఉక్రెయిన్ పట్టుబడుతుండగా.. పలు ఒప్పందాలకు ఆమోదం తెలపాలని రష్యా డిమాండ్ చేస్తోంది.

తమ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులు సహా ఇతర దేశస్తులు సురక్షితంగా దేశాన్ని విడిచి వెళ్లేలా సాయం చేస్తున్నామని ఇండియాలో ఉక్రెయిన్ రాయబారి ఐగోర్ పోలిఖా తెలిపారు. భారతీయ విద్యార్థుల రక్షణ విషయంలో హామీ ఇవ్వాల్సింది రష్యా మాత్రమేనని చెప్పారు. యుద్ధాన్ని ఆపడం, రష్యాపై ఒత్తిడి తీసుకురావడం ఉక్రెయిన్ ప్రాధాన్యతా అంశమని అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ శరణార్థుల సంఖ్య 4 లక్షలకు పైగానే ఉందని… యుద్ధం ఇలాగే కొనసాగితే ఆ సంఖ్య 70 లక్షలను దాటుతుందని తెలిపారు. రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లో 102 మంది పౌరులు మృతి చెందారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. రష్యా సేనలను ప్రతిఘటిస్తూ వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్​కు తమవంతు సాయం చేసేందుకు నాటో సభ్య దేశాలు ముందుకు రావడం కీలక పరిణామంగా మారింది. గగనతల రక్షణ క్షిపణులు, ట్యాంకు విధ్వంసక ఆయుధాలను అందించాలని సభ్య దేశాలు నిర్ణయించాయని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్​బర్గ్ తెలిపారు. ఆర్థిక, మానవతా సహాయాన్ని సైతం అందిస్తామని తెలిపాయి.

https://www.youtube.com/watch?v=2rLWOAZ-MOA