Lightning strikes Christ the Redeemer statue: క్రీస్తు విగ్రహం మెరుపు పడిన దృశ్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. బ్రెజిల్ లోని క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహాంపై పిడుగుపడింది. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజెన్లు ఈ చిత్రాన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 10న మెరుపుదాడిని చిత్రీకరించారు. మెరుపు చిత్రాన్ని మస్సిమో అనే నెటిజెన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ ఫోటోను 18 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.
Read Also: Turkey Earthquake: టర్కీలో 28 వేలకు చేరిన మరణాల సంఖ్య.. రెట్టింపు ఉంటాయని యూఎన్ అంచనా….
బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఉన్న క్రైస్ట్ ద రిడీమర్ విగ్రహంపై ఇంతకుముందు కూడా పిడుగులు పడ్డాయి. 2014లో మెరుపుదాడిలో విగ్రహం బొటనవేలు దెబ్బతింది. ప్రపంచంలోనే ప్రసిద్ధ కట్టడాల్లో ఈ విగ్రహం కూడా ఉంది. ప్రతీ ఏటా కొన్ని లక్షల మంది ఈ విగ్రహాన్ని సందర్శిస్తుంటారు. మతపరంగా దీనికి విశిష్టస్థానం ఉంది. క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహం, పోర్చుగీస్‌లో క్రిస్టో రెడెంటర్ అని కూడా పిలుస్తారు. ఇది క్రైస్తవమతానికి చిహ్నంగా, బ్రెజిల్ లో ప్రసిద్ధమై వాటిలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ విగ్రహం 30 మీటర్ల పొడవు ఉంటుంది. రియో డిజనీరో నగరంలోని కోర్కోవాడో పర్వతంపై దీన్ని నిర్మించారు. దీని నిర్మాణం 1931 పూర్తయింది. ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన ల్యాండ్ మార్క్ లలో ఇది కూడా ఒకటి.
Lightning struck Christ the Redeemer in Rio de Janeiro on February 10, 2023
[more📷by Fernando Braga: https://t.co/xSDfq7x5Z3] pic.twitter.com/FLr25VhLEB
— Massimo (@Rainmaker1973) February 11, 2023