భారత సంతతికి చెందిన విద్యార్థిని సుదీక్ష కోనంకి(20) డొమినికన్ రిపబ్లిక్‌లోని బీచ్‌లో హఠాత్తుగా అదృశ్యమైంది. అర్ధరాత్రి సమయంలో బికినీ ధరించి బీచ్‌లో నడుస్తుండగా కనిపించకుండా పోయింది. మార్చి 6న స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహార యాత్రకు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. సుదీక్ష తప్పిపోయిన విషయాన్ని స్నేహితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమె కోసం అధికారులు గాలిస్తున్నారు. అయితే ఆమె తప్పిపోయి.. వారం రోజులు అవుతున్నా.. ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. అయితే తమ కుమార్తెను కిడ్నాప్ చేసి ఉంటారని పేరెంట్స్ అనుమానిస్తున్నారు.
తాజాగా సుదీక్షకు సంబంధించిన ఒక ఫొటోను డొమినికన్ రిపబ్లిక్ అధికారులు విడుదల చేశారు. రోడ్డుపై ఆమె చివరి సారిగా ఒక యువకుడి(24)తో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను బట్టి ఒకరి భుజంపై ఒకరు చేతులేసుకుని నడుస్తున్న ఫొటో బయటకు వచ్చింది. ఇద్దరూ కూడా గాఢంగా కౌగిలించుకుని తిరిగారు. ఇంతకీ అతడెవరనేది ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సుదీక్షను కౌగిలించుకున్న యువకుడి పేరు జాషువా స్టీవ్ రైబ్. ఇతడు కూడా ఒక టూరిస్టే. అయోవా ప్రాంతానికి చెందిన పర్యాటకుడు. కరేబియన్ పర్యటనలోనే సుదీక్షకు పరిచయం అయ్యాడు. రియు రిపబ్లిక్ రిసార్ట్‌లో అర్ధరాత్రి 3గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి సుదీక్ష పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో సుదీక్ష అధిక మొత్తంలో మద్యం సేవించినట్లుగా సీసీ టీవీ ఫుటేజ్‌లో అధికారులు గుర్తించారు. అనంతరం 4 గంటల ప్రాంతంలో సుదీక్ష.. స్నేహితులతో కలిసి బీచ్‌కు వచ్చింది. కొద్దిసేపటి తర్వాత స్నేహితులు.. తిరిగి రిసార్ట్‌లోకి వెళ్లిపోయారు. సుదీక్ష ఒక్కతే బీచ్‌లో ఉండిపోయింది. ఆ సమయంలో జాషువా స్టీవ్ రైబ్ కూడా బీచ్‌లోనే ఉన్నాడు. సుదీక్ష చాలా సేపు అతడితోనే ఉంది. ఆ సమయంలో సుదీక్ష బికినీలోనే ఉంది. అయితే ఎంతసేపటికి సుదీక్ష రాకపోవడంతో స్నేహితులు బీచ్‌కు వచ్చి చూడగా కనిపించలేదు. సుదీక్ష బట్టలు మాత్రం బీచ్ ఒడ్డున కనిపించాయి. దీంతో స్నేహితులు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు.. పడవలు, డ్రోన్లు, హెలికాప్టర్లతో జల్లెడ పట్టారు. అయినా కూడా ఆచూకీ లభించలేదు. అయితే సుదీక్షతో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. బీచ్‌లో ఉండగా సుదీక్ష వాంతు చేసుకుందని.. ఆ సమయంలో స్పృహ తప్పిపడిపోయిందని… అలలకు బీచ్‌లోకి కొట్టుకుపోయి ఉంటుందని తిక్కతిక్క సమాధానాలు ఇచ్చాడు. కానీ అతడిపై ఎలాంటి కేసులు మాత్రం నమోదు చేయలేదు. అనుమానాలు కూడా వ్యక్తం చేయలేదు.
అయితే సుదీక్ష తల్లిదండ్రులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెను కచ్చితంగా కిడ్నాప్ చేశారని.. ఒకవేళ బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటే ఈపాటికే శవం బయటకు వచ్చేదని వాదిస్తు్న్నారు. దీని బట్టి కచ్చితంగా ఎవరూ కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగా కూడా పోలీసులు విచారిస్తు్న్నారు.
సుదీక్ష.. అమెరికాలో విద్యను అభ్యసిస్తోంది. 2026లో పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలు కాబోతుంది. ఇక అంతకముందు వర్జీనియాలోని అలెగ్జాండ్రియాలోని థామస్ జెఫెర్సన్ హై స్కూల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంది. తన స్నేహితులతో కలిసి మార్చి 6న కరేబియన్ దేశానికి విహార యాత్రకు వెళ్లింది. బికినీ ధరించి బీచ్‌లో నడుస్తుండగా అదృశ్యమైంది. సుదీక్ష ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు. నల్లటి జుట్టు. గోధుమ రంగు కళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆమె అదృశ్యమైన సమయంలో గోధుమ రంగు బికినీ.. పెద్ద గుండ్రని చెవిపోగులు. కుడి కాలు మీద మెటల్ డిజైనర్ ఉంది. కుడి చేతిలో పసుపు మరియు స్టీల్ బ్రాస్‌లెట్‌లు. ఎడమ చేతిలో బహుళ వర్ణ పూసల బ్రాస్‌లెట్ ధరించి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
Evidentemente el joven que vio por última vez a la joven de la India Sudiksha Konanki, de 20 años, desaparecida en la madrugada del 6 de marzo en Punta Cana, NO es haitiano.
Bien blanquito que es, ojalá y no le haya hecho daño 🥺 pic.twitter.com/KlSHTBJ7eV
— 👙 Kenken 👙 (@FdezKendra) March 11, 2025