Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- పాకిస్తాన్లో గుర్తుతెలియని వ్యక్తుల మరో దాడి..
- లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో మరోసారి గుర్తుతెలియని వ్యక్తుల హల్చల్ చేశారు. ఉగ్రవాద నాయకుడిపై మరోసారి టార్గెటెడ్ అటాక్ జరిగింది. ఆ దేశంలోని బలూచిస్తాన్ ప్రావిన్సులో అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా ఉగ్రసంస్థ సీనియర్ కమాండర్ మీర్ శుక్ర ఖాన్ రైసాని హతమయ్యాడు. ఇటీవల కాలంలో లష్కరేకు చెందిన పెద్ద తలకాయలను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేస్తు్న్నారు. ఏ ప్రావిన్సులో ఉన్నా కూడా వెతికి మరి చంపుతున్నారు.
తాజాగా జరిగిన సంఘటన బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో జరిగింది. ఒక లష్కరే తోయిబా కార్యక్రమంలో పాల్గొన్న కొద్దిసేపటికే రైసాని అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ దాడిపై పాకిస్తాన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు ఈ హత్యకు ఏ సంస్థ కూడా బాధ్యత తీసుకోలేదు. ఇలాంటి ఘటనలకు పాకిస్తాన్ ప్రభుత్వం పరోక్షంగా భారత్ సహకరిస్తుందని ఆరోపిస్తోంది.
Also Read
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
రైసానీ మరణానికి ఒక రోజు ముందు క్వెట్టాలో లష్కరే తోయిబా నిర్వహించిన ‘‘మార్కా-ఎ-హక్’’ వార్షికోత్సవక కార్యక్రమంలో పాల్గొన్నాడు. లష్కర్ బలూచిస్తాన్ చీఫ్ హాఫిజ్ ఇద్రీస్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రైసాని బలూచ్ లష్కరే నెట్‌వర్క్‌లో ప్రముఖ వ్యక్తి. ఉగ్రవాద సంస్థ రిక్రూట్మెంట్, శిక్షణ వంటి కీలక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాడు. బలూచిస్తాన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌లో చీలికలు, అంతర్గత పోరు, వేర్పాటువాదుల తిరుగుబాటు నేపథ్యంలో ఈ హత్య జరిగింది.
టీవలి నెలల్లో, షేక్ యూసుఫ్ అఫ్రిది, అమీర్ హమ్జా తదితరులతో సహా పలువురు ఉన్నత స్థాయి లష్కర్-ఎ-తైబా కమాండర్లు ఇలాంటి గుర్తుతెలియని సాయుధ దాడులలో హతమయ్యారు. హఫీజ్ సయీద్ స్థాపించిన ఈ ఉగ్ర సంస్థ భారత్‌లో విధ్వంసమే లక్ష్యంగా పని చేస్తోంది. 2008 ముంబై ఉగ్ర దాడులకు ఈ సంస్థే సూత్రధారి.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!