Site icon NTV Telugu

Lashkar Taiba: ఆపరేషన్ సిందూర్‌తో మా కార్యాలయం దెబ్బతింది.. లష్కరే తోయిబా వీడియో వైరల్

Lashkar Taiba

Lashkar Taiba

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఏ మేరకు ఉందో తాజాగా లష్కరే తోయిబా పోస్ట్ చేసిన వీడియోలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. ఈ మేరకు లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి: Pakistan: పాక్-సౌదీ ఒప్పందం తర్వాత భారత్‌పై పాకిస్థాన్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు

మే 7న భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మురిడ్కేలో దెబ్బతిన్న ప్రధాన కార్యాలయాన్ని గతంలో కంటే గొప్పగా నిర్మిస్తామని లష్కరే కమాండర్ ఖాసిమ్ వెల్లడించాడు. ‘‘నేను మురిడ్కేలో భారత్ దాడిలో ధ్వంసమైన తోయిబా శిథిలాలపై ఉన్నాను. దేవుడి దయ వల్ల గతంలో కంటే భారీగా దీనిని నిర్మిస్తాం’’ అని ఖాసిమ్‌ ప్రకటించాడు. ఇక భారతదేశంలో దాడులకు చురుకుగా శిక్షణ పొందుతున్న గ్రూపులకు పాకిస్థాన్ ఆశ్రయం..నిధులు సమకూరుస్తుందని ఖాసిమ్ పేర్కొన్నాడు. ధ్వంసమైన ఈ కార్యాలయంలోనే అనేక మంది ఉగ్రవాదులు శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Anshu Malika: పోస్ట్ వైరల్.. అమెరికాలో ఏపీ మాజీ మంత్రి కూతురికి అవార్డ్!

ఫిబ్రవరి 5, 2026న కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం జరుపుకునేందుకు సిద్ధపడుతోంది. ఆ సమయానికి కొత్త భవనం పునర్నిర్మాణం పూర్తి కావాలని భావిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇక తిరిగి నిర్మించిన కొత్త భవనంలో మరోసారి శిక్షణ, బోధన, కార్యాచరణ ప్రణాళికకు కేంద్రంగా పని చేయబోతుందని తెలుస్తోంది.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. మే 7న పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో ఉగ్రవాద శిబిరాలతో పాటు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల జైషే కమాండర్‌ ఇలియాస్‌ కశ్మీరీ మాట్లాడుతూ ఆపరేషన్‌ సిందూర్‌లో మసూద్‌ అజర్‌ కుటుంబం చిన్నాభిన్నమైందని అంగీకరించాడు. తాజాగా లష్కరే తోయిబా బయటపడడ్డాది.

 

Exit mobile version