Malaysia Landslide: మలేసియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరుకోగా.. మరో 12 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు అక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు. రోడ్డు పక్కనున్న ఫార్మ్‌హౌస్‌ను క్యాంప్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేశారని.. క్యాంప్ వెనకాల ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడిందని.. విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ నరోజమ్ ఖామిస్ తెలిపారు. ఏడాది క్రితం ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయని, దాంతో సుమారు 21 వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.
Fire Accident: మంచిర్యాలలో ఘోర అగ్నిప్రమాదం.. 6మంది సజీవదహనం
కాగా.. శుక్రవారం తెల్లవారుజామున సెలంగోర్ రాష్ట్రం బటంగ్ కలి పట్టణ సమీపంలోని ఓ ఫార్మ్‌హౌస్‌లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. 100 అడుగుల ఎత్తు నుంచి బురద, రాళ్లతో కూడిన మట్టి.. ఫార్మ్‌హౌస్‌లోని మూడెకరాల్లో 90 మంది పర్యాటకులు ఉన్న క్యాంప్ సైట్‌ను ఒక్కసారిగా ముంచెత్తింది. ఈ ఘటనలో 21 మంది బురద మట్టి కింద సజీవ సమాధి అయ్యారు. మరో 12 మంది జాడ తెలియకుండా పోయారు. అయితే.. ఇక్కడ క్యాంప్‌గ్రౌండ్ నిర్వహించడానికి యజమానుల వద్ద లైసెన్స్ లేదని అధికారులు స్థానిక మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన నుంచి డజన్లకొద్ది మంది సురక్షితంగా బయటపడ్డారని, ఏడుగురిని ఆసుపత్రిలో చేర్పించామని జిల్లా పోలీస్ చీఫ్ సుఫియాన్ అబ్దుల్లా చెప్పారు.
Army Commander RP Kalita: భారత్-చైనా సరిహద్దుపై ఆర్మీ కమాండర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడిన ఓ వ్యక్తి (57) మాట్లాడుతూ.. “మా గుడారాన్ని మట్టి కప్పడంతో నా కుటుంబం, నేను చిక్కుకున్నాము. అయితే.. మేము ఎలాగోలా తప్పించుకొని, కార్ పార్క్ ప్రాంతానికి చేరుకోగలిగాం. ఇంతలోనే రెండోసారి కొండచరియలు విరిగిపడటాన్ని విన్నాం’’ అని చెప్పాడు. మరోవైపు.. ప్రస్తుతం మలేసియాలో మాన్‌సూన్ సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా నదులు, జలపాతాలు, కొండప్రాంతాలకు దగ్గరలో ఉన్న క్యాంప్‌సైట్లను వారం రోజుల పాటు మూసివేయనున్నట్టు ఆ దేశ డెవలప్‌మెంట్ మంత్రి కోర్ మింగ్ స్పష్టం చేశారు.