NTV Telugu Site icon

కొత్త‌గా మ‌రో వేరియంట్‌…29 దేశాల్లో క‌ల‌క‌లం…

క‌రోనా అంటేనే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నారు.  క‌రోనా వైర‌స్‌లో కొత్త కొత్త వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయి.  ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, డెల్టా ప్ల‌స్‌, ఇప్పుడు లాంబ్డా వేరియంట్  ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతున్న‌ది.  అయితే, ఈ వేరియంట్ మొద‌ట పెరూ దేశంలో బ‌య‌ట‌ప‌డింది.  పెరూలో వ‌చ్చిన కేసుల్లో 80 శాతం ఈ వేరియంట్ కేసులు ఉన్నాయి. ఆ త‌రువాత అక్క‌డి నుంచి ఈ వేరియంట్ చిలీ, ఈక్వెడార్‌, అర్జెంటైనాతో స‌హా 29 దేశాల‌కు వ్యాపించింది.  ఇప్పుడు బ్రిట‌న్‌లో ఈ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.  

Read: శరత్ మండవ, రవితేజ ప్రాజెక్ట్ షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్…!!

ఈ స్పైక్ ప్రోటీన్‌లో ఎల్ 452క్యూ, ఎఫ్ 490 ఎస్ తో పాటు ప‌లు ఉత్ప‌రివ‌ర్త‌నాలు ఉండ‌టంతో దీనిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ దృష్టిసారించింది.  ఈ లాంబ్డా వేరియంట్‌ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ప్ర‌క‌టించింది.  దీనిపై బ్రిట‌న్ శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.  దీని ప్ర‌భావం, తీవ్ర‌త త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, అజాగ్ర‌త్త‌గా ఉంటే, ఇదికూడా ప్ర‌మాద‌కారిగా మారే అవ‌కాశం ఉంటుంద‌ని, అందుకే పూర్తిస్థాయిలో ఈ లాంబ్డార‌కం వేరియంట్ల‌పై ప‌రిశోధ‌న చేస్తున్న‌ట్టు లండ‌న్ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.