Site icon NTV Telugu

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌: దేశం విడిచి వెళ్లొద్దు అంటూ వార్నింగ్..!

ప్రంపంచదేశాలను వణికిస్తోంది కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతున్న తరుణంలో.. మరోసారి ఒమిక్రాన్‌ విజృంభిస్తుండడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు.. ఇప్పటికే 14 దేశాలను చుట్టేసింది కొత్త వేరియంట్.. దీంతో అన్ని దేశాలు నివారణ చర్యలకు పూనుకుంటున్నాయి.. అంతర్జాతీయ ప్రయాణలపై ఆంక్షలు విధిస్తున్నాయి.. వ్యాక్సిన్‌ వేసుకున్నా, టెస్ట్‌ చేయించుకుని నెగిటివ్‌ రిపోర్ట్‌తో వచ్చినా.. మళ్లీ కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. దేశ పౌరులు, వలసదారులకు కువైట్‌ సర్కార్‌ కీల ఆదేశాలు జారీ చేసింది.

Read Also: రైతుల సంక్షేమంలో దేశానికే కేసీఆర్ మార్గదర్శి..

ఒమిక్రాన్‌ వేరియంట్‌ టెన్షన్‌ పెడుతోన్న ఈ సమయంలో.. దేశం పౌరులు కానీ, ప్రవాసులు కానీ బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది కువైట్‌ ప్రభుత్వం.. నయా వేరియంట్‌ కలవరపెడుతున్న సమయంలో విదేశాలకు వెళ్లడం మంచిది కాదని అంతర్గత, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే, మరికొన్ని రోజుల తర్వాత ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ఓ అవగాహన వస్తుందని.. అప్పటి వరకు మాత్రం దేశం నుంచి బయటకు వెళ్లకపోవడమే శ్రేయస్కారం అని సూచిస్తున్నారు అధికారులు. మరోవైపు గత నెలలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా.. కరోనా నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించాలని.. తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే ప్రత్యేక అనుమతులు తీసుకుని దేశం వీడితే బాగుంటుందని స్పష్టం చేసింది కువైట్‌ ప్రభుత్వం.

Exit mobile version