Donald Trump: ట్రంప్‌ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- ట్రంప్‌ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్
- మేము (బ్రిటన్) లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారు అని కింగ్ చార్లెస్ నవ్వుతూ సెటైర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ రాజు చార్లెస్ III యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వైట్ హౌస్‌లో జరిగిన స్టేట్ డిన్నర్‌లో స్మార్ట్ హిస్టారిక్ జోక్‌తో రోస్ట్ చేశారు. ట్రంప్ ఇటీవల యూరప్ గురించి చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా కింగ్ చార్లెస్ ఈ జోక్ చేశారు. వైట్ హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో జరిగిన డిన్నర్‌లో ఇరు నాయకులు తమ టోస్ట్ సందేశాలలో హాస్యం కలిపి మాట్లాడారు. ట్రంప్ గతంలో యూరపియన్ దేశాలు అమెరికా సహాయం లేకపోతే జర్మన్ భాష మాట్లాడేవారని వ్యాఖ్యానించిన విషయాన్ని కింగ్ చార్లెస్ ప్రస్తావించారు. “మీరు ఇటీవల చెప్పారు, మిస్టర్ ప్రెసిడెంట్, అమెరికా లేకపోతే యూరప్ దేశాలు జర్మన్ మాట్లాడేవి అని. ధైర్యంగా చెప్పాలంటే, మేము (బ్రిటన్) లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారు” అని కింగ్ చార్లెస్ నవ్వుతూ సెటైర్స్ వేశారు. ఈ వ్యాఖ్యతో హాల్‌లో ఉన్న అతిథులు ఘోల్లుమని నవ్వారు.
అమెరికా స్వాతంత్ర్యానికి ముందు (సుమారు 250 సంవత్సరాల క్రితం) ఉత్తర అమెరికాలో బ్రిటన్, ఫ్రాన్స్ కాలనీల మధ్య జరిగిన యుద్ధాలను సూచిస్తుంది. బ్రిటిష్ విజయం వల్ల అమెరికా ఇంగ్లీష్ భాషా ప్రభావంలో ఉందని హాస్యాస్పదంగా చెప్పారు. కింగ్ చార్లెస్ తన ప్రసంగంలో అమెరికా మ్యాప్‌లో ఉన్న బ్రిటిష్, ఫ్రెంచ్ పేర్లను కూడా ప్రస్తావించి ఈ జోక్‌ను మరింత ఆకర్షణీయం చేశారు. ఈ సందర్భంగా కింగ్ చార్లెస్ మరిన్ని హాస్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్ ఈస్ట్ వింగ్‌లో జరుగుతున్న మార్పులను ప్రస్తావిస్తూ, “1814లో బ్రిటిష్ వారు వైట్ హౌస్‌ను కొంచెం రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ చేయడానికి ప్రయత్నించాము” అని జోక్ చేశారు (1814లో బ్రిటిష్ సైన్యం వైట్ హౌస్‌ను కాల్చివేసిన సంఘటనను సూచిస్తూ).ఈ జోక్ వేగంగా వైరల్ అవుతోంది.
Also Read
- China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
- Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
- Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
ట్రంప్ యూరప్‌పై చేసిన వ్యాఖ్యలకు ఇది తగిన సమాధానంగా పరిగణిస్తున్నారు. ఇరు నాయకుల మధ్య స్నేహపూర్వక వాతావరణంలోనే ఈ హాస్యం జరిగింది. కింగ్ చార్లెస్ తన ప్రసంగంలో బ్రిటన్-అమెరికా సంబంధాల బలాన్ని కూడా ప్రశంసించారు. ఈ ఈవెంట్ రెండు దేశాల మధ్య చారిత్రక బంధాలను హాస్యంతో కలిపి గుర్తు చేసిన అపూర్వ సందర్భంగా మారింది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!