ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న దండయాత్రకు అంతర్జాతీయంగా ఖండన ఉన్నప్పటికీ, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదివారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు పూర్తి మద్దతును ప్రకటించారు.
“రష్యా ప్రజలు అన్ని రకాల సవాళ్లు, కష్టాలను ఎదుర్కొంటూ తమ దేశం యొక్క గౌరవం, భద్రతను కాపాడుకోవడంలో గొప్ప విజయాలు సాధించారు” అని కిమ్ ఓ సందేశంలో పేర్కొన్నట్లు ప్యాంగ్యాంగ్ అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. రష్యా దినోత్సవం సందర్భంగా పుతిన్‌కు కిమ్ మద్దతు ప్రకటించినట్లు వెల్లడించింది. కొరియా ప్రజలు వారికి పూర్తి మద్దతు, ప్రోత్సాహాన్ని అందిస్తారని కిమ్ పేర్కొన్నట్లు ప్రకటించింది.
ఉక్రెయిన్‌పై అనూహ్య దాడి కేవలం రష్యా భద్రత కోసమేనని కిమ్ స్పష్టంగా ప్రస్తావించడం.. రెండు దేశాల మధ్య దశాబ్దాల నాటి సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలను వివరించే సంకేతమేనని.. యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై అంతర్జాతీయ సమాజం నుండి విమర్శలు పెరుగుతున్నప్పటికీ, ప్యాంగ్‌యాంగ్ ఇటీవల మాస్కోతో తన సన్నిహిత సంబంధాలను నొక్కి చెప్పింది.
అంతర్జాతీయంగా న్యాయాన్ని పరిరక్షించడం, ప్రపంచ భద్రతను నిర్ధారించే ప్రయాణంలో అన్ని రంగాలలో స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం అవుతాయని కిమ్ విశ్వాసం వ్యక్తం చేసినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. 2019లో రష్యాలోని వ్లాడివోస్టాక్ నగరంలో కిమ్ పుతిన్‌తో మొదటిసారి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు.