Kidnapped Indian-Origin Family Of 4 Found Dead In US: అమెరికాలో మూడు రోజుల క్రితం కిడ్నాప్ అయిన భారతసంతతి కుటుంబం దారుణంగా హత్యకు గురైంది. ఎనిమిది నెలల పాపతో పాటు మరో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన స్థానిక భారత సంతతిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎనిమిది నెలల అరోహి ధేరి, పాప తల్లిదండ్రులు 27 ఏళ్ల జస్లిన్ కౌర్, 36 ఏళ్ల జస్దీప్ సింగ్, 39 ఏళ్ల మేనమామ అమన్ దీప్ సింగులు ఇటీవల కిడ్నాపుకు గురయ్యారు. కుటుంబ సభ్యులకు చెందిన ఓ వాహనం సోమవారం మంటల్లో కనిపించడంతో నలుగురు కిడ్నాప్ అయినట్లు పోలీసులు నిర్థారించారు.
Read Also: Errabelli Dayakar Rao: బీఆర్ఎస్ పేరు మార్చేసిన మంత్రి… వైరల్‌గా మారిన వీడియో
నలుగురిని వ్యాపార స్థలం నుంచి ఆయుధాలు ధరించిన ఓ వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వీరంతా శవాలుగా కనిపించారని అధికారులు తెలిపారు. కాలిఫోర్నియాలోని ఓ తోటలో నలుగురి మృతదేహాలను పోలీసులు కనుక్కున్నారు మెర్సిడ్ కౌంటీ పోలీసులు. ఇండియానా రోడ్, హచిన్సన్ రోడ్ సమీపంలోని తోటలో బుధవారం సాయంత్రం నలుగురి శవాలను అక్కడ పనిచేసే వ్యవసాయ కార్మికుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన తర్వాత పోలీసులు అనుమానిత కిడ్నాపర్ 48 ఏళ్ల జీసస్ మాన్యువల్ సల్గాడోను అదుపులోకి తీసుకున్నారు. సల్గాడోకు నేర చరిత్ర ఉందని.. ఈ కిడ్నాప్ తరువాత అతడు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ మరణాలపై మెర్సిడ్ కౌంటీ పోలీసు అధికారి తీవ్రభావోద్వేగానికి లోనయ్యారు. నాకు వచ్చే కోపాన్ని పదాల్లో వర్ణించలేదని.. నేరానికి పాల్పడిన వ్యక్తికి నరకంలో ప్రత్యేక స్థానం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్దీప్ తల్లిదండ్రులు డాక్టర్ రణధీర్ సింగ్, కిర్పాల్ కౌర్ పంజాబ్ లోని హోషియార్ పూర్ తాండా బ్లాక్ లోని హర్సిపిండ్ గ్రామానికి చెందిన వారు. కాలిఫోర్నియాలో జస్దీప్ సింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు.
