NTV Telugu Site icon

Israel-Iran War: ఇజ్రాయెల్, యూఎస్‌కు ఇరాన్ వార్నింగ్.. ప్రతీకారం తీర్చుకుంటామని ఖమేనీ హెచ్చరిక

Iranwarning

Iranwarning

ఇజ్రాయెల్.. దాని మిత్రదేశమైన అగ్ర రాజ్యం అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. రెండు దేశాలపై ప్రతీకార చర్యలుంటాయని హెచ్చరించారు. ఎప్పుడు, ఎలా జరుగుతాయన్న విషయం మాత్రం ఖమేనీ వెల్లడించారు. ప్రతిఘటనైతే మాత్రం ఉంటుందని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన విద్యార్థి సమావేశంలో ఖమేనీ మాట్లాడారు. ఇరాన్‌కు అండగా ఉండే హుతీలు, హిజ్బుల్లా, హమాస్‌‌లపై దాడి చేసిన శత్రువలుపై తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని శనివారం ఖమేనీ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: US Bans Indian Companies:15 భారతీయ కంపెనీలపై అమెరికా నిషేధం.. కారణం?

అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ 180 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిని గగనతలంలోనే ఇజ్రాయెల్ పేల్చేసింది. కొన్ని మాత్రం ఇజ్రాయెల్ ప్రాంతాన్ని తాకాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది. ఇరాన్ రక్షణ వ్యవస్థకు సంబంధించిన స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ పెట్టుకున్న గురి అమలు చేసి తీరింది. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ లక్ష్యాన్ని చేరుకుంది. అయితే ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికాపై పగతో రగలిపోతుంది. తాజాగా శనివారం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Chiranjeevi: చిరంజీవి ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి

Show comments