NTV Telugu Site icon

Kash Patel: “గర్ల్‌ఫ్రెండ్” సమక్షంలో FBI చీఫ్‌గా కాష్ పటేల్ ప్రమాణస్వీకారం.. అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు..?

Kash Patel

Kash Patel

Kash Patel: అమెరికా నిఘా సంస్థ ‘‘ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(FBI)’’ తొమ్మిదవ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత భారత మద్దతుదారులకు కీలక పదవులు కట్టబెట్టారు. ఇప్పటికే ప్రో-ఇండియా భావాలు కలిగి ఉన్న మార్కో రూబియోని అమెరికా విదేశాంగ సెక్రటరీగా, మైక్ వాల్ట్జ్‌ని జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. అమెరికా నిఘా అధిపతిగా భారత సంతతి మహిళ తులసీ గబ్బార్డ్ బాధ్యతలు చేపట్టారు. తాజాగా కాష్ పటేల్ ఎఫ్‌బీఐ అధిపతిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ‘‘భగవద్గీత’’పై ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండి ప్రమాణం చేయించారు.

అయితే, కాష్ పటేల్ తన గర్ల్‌ఫ్రెండ్ అలెక్సిస్ విల్కిన్స్ సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఆమె గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. కాష్ పటేల్ కుటుంబంతో పాటు గర్ల్‌ఫ్రెండ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కంట్రీ సింగర్, రిపబ్లిక్ ప్రతినిధి అబ్రహం హమాడే ప్రెస్ సెక్రటరీగా అలెక్సిస్ విల్కిన్స్‌గా సుపరిచితం. వైట్ డ్రస్ ధరించి, కాష్ పటేల్ పక్కన నిల్చున్న ఇప్పుడు ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది.

Read Also: Belagavi: మరాఠీ మాట్లాడనందుకు బెళగావిలో కండక్టర్‌పై దాడి..

ఇంతకీ అలెక్సిక్ విల్కిన్స్ ఎవరు..?

నవంబర్ 3, 1998న అర్కాన్సాస్‌లో జన్మించిన అలెక్సిస్ విల్కిన్స్ తన బాల్యాన్ని ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్‌లో గడిపింది. ఆ తర్వాత టెనస్సీలోని నాష్ విల్లేకి వెళ్లింది. 26 ఏళ్ల అలెక్సిస్ బెల్మాండ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్, పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పొందారు. కంట్రీ సింగర్, రచయిత్రి చాలా మందికి అలెక్సిక్ సుపరిచితం. ఈమె కాపిటల్ హిల్‌లో రిపబ్లికన్ ప్రతినిధి అబ్రహం హమాడేకు ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

కంట్రీ సింగర్‌గా అలెక్సిస్ ఆమె క్రిస్ యంగ్, జో నికోల్స్, సారా ఎవాన్స్, పర్మలీ వంటి ప్రఖ్యాత ఆర్టిస్టులతో వేదిక పంచుకున్నారు. అలెక్సిస్ తొలి సింగిల్ ఈపీ అండ్ వెటరన్స్ డే పాట మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఏకంగా 1 మిలియన్ స్ట్రీమ్స్ అందుకుంది. కాష్ పటేల్‌ని 2022 అక్టోబర్‌లో తొలిసారిగా ఓ కార్యక్రమంలో అలెక్సిస్ విల్కిన్స్ కలుసుకున్నారు. ఇద్దరు 2023 ప్రారంభం నుంచి డేటింగ్‌లో ఉన్నారు.