Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ ప్రచారంలో జోరు పెంచారు. ప్రచారంలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రష్యా- ఉక్రెయిన్‌ల శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడని కలవబోనని వెల్లడించారు. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో వారి మధ్య శాంతి చర్చల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలుస్తారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చింది.
Read Also: Tomato and Onion Prices: కిచెన్‌కు రానంటున్న టమోటా..! కోయకుండానే కన్నీరుపెట్టిస్తున్న ఉల్లిగడ్డ..
కాగా, ఉక్రెయిన్ లేకుండా ద్వైపాక్షిక చర్చలు జరగవు.. ఉక్రెయిన్ భవిష్యత్తుపై ఆ దేశమే చెప్పాలని కమలా హరీస్ పేర్కొన్నారు. ఇక, ఉక్రెయిన్‌పై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విధానాలపై హారిస్ విమర్శలు గుప్పించింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే పుతిన్ ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని కైవ్‌లో అధికారాన్ని సాధించేవారని ఆరోపించింది. ఇకపోతే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కి మద్దతుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడయ్యే వరకు తాను వెన్నంటే ఉంటానని మస్క్ తెలిపారు. ఒకవేళ ట్రంప్ గెలవకపోతే అమెరికాకు లాస్ట్ ఎన్నికలని ఎలాన్ మస్క్ వెల్లడించారు.