Site icon NTV Telugu

Kamala Harris: కాలిఫోర్నియా గవర్నర్ పోటీపై కమలా హారిస్ క్లారిటీ

Kamalaharris

Kamalaharris

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అందుకోసం ఆమె ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు టాక్ నడిచింది. తాజాగా ఆ వార్తలపై కమలా హారిస్ స్పందించారు. కాలిఫోర్నియా గవర్నర్ రేసులో తాను పాల్గొనడం ప్రకటించారు. కేవలం అదంతా చర్చ మాత్రమేనని కొట్టిపారేశారు. కాలిఫోర్నియా తన రాష్ట్రమని.. ఇక్కడ ప్రజలను ప్రేమిస్తున్నట్లు చెప్పారు. లోతైన ఆలోచనల తర్వాత గవర్నర్ పదవికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Gang R*ape: మైనర్ బాలిక పై ఐదుగురు మైనర్ ల గ్యాంగ్ రే*ప్

గతంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్, యూఎస్ సెనేటర్‌గా కమలా హారిస్ పని చేశారు. అయితే తన సేవ ఒక భాగానికే పరిమితం కాకూడదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. 2028లో జరగబోయే అధ్యక్ష బరిపై ఆమె దృష్టి పెట్టినట్లు సమాచారం. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై పరాజయం పాలయ్యారు. తిరిగి 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాలిఫోర్నియా గవర్నర్ రేసు నుంచి ఆమె తప్పుకున్నారు. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో తన సత్తా చూపించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: New UPI Guidelines: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. రేపటి నుంచే కొత్త రూల్స్!

 

Exit mobile version