Site icon NTV Telugu

కాబూల్ ఎయిర్‌పోర్ట్ మూసివేత‌… ఆందోళ‌న‌లో ఆఫ్ఘ‌న్ వాసులు…

ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వెన‌క్కి వెళ్లిపోవ‌డంతో తాలిబ‌న్లు ఆ దేశాన్ని ఆక్ర‌మించుకున్నారు.  కాబూల్‌లోకి తాలిబ‌న్లు చొచ్చుకొస్తున్నారని వార్త‌లు అంద‌టంతో వేలాది మంది పౌరులు దేశాన్ని వ‌ద‌లి వెళ్లేందుకు సిద్ద‌మ‌య్యాయి. వేలాది మంది పౌరులు ఎయిర్ పోర్టుకు చేరుకొని విమానాలు ఎక్కేందుకు ప్ర‌య‌త్నించారు.  ఆ స‌మ‌యంలో వారికి కంట్రోల్ చేసేందుకు ఆమెరికా ఆర్మీ గాల్లోకి కాల్పులు జ‌రిపింది. ద దీంతో అక్క‌డ తొక్కిస‌లాట జ‌రిగింది.  ఈ తొక్కిస‌లాట‌లో ముగ్గురు పౌరులు మృతి చెందారు.  ఇక ఇదిలా ఉంటే, కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో క‌ల‌క‌లం రేగ‌డంతో ఎయిర్‌పోర్ట్‌ను మూసేస్తున్న‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు.  త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చేవ‌ర‌కు సివిల్ ఏవియేష‌న్‌కు అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు.  వెంట‌నే ఈ ఉత్త‌ర్వులు అమ‌లులోకి రావ‌డంతో ప‌లు దేశాలు త‌మ విమానాల‌ను దారి మ‌ళ్లించాయి.  ఢిల్లీ-చికాగో విమానంను దారిమ‌ళ్లించారు.  ఇక ఇదిలా ఉంటే, కాబూల్ నుంచి ఇండియా దౌత్య‌వేత్తులు, అధికారులు, వ్యాపారం నిమిత్తం ఆ దేశం వెళ్లిన వారిని ఇండియారు తీసుకొచ్చేందుకు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో రెండు ఎయిర్ ఇండియా విమానాల‌ను సిద్ధంగా ఉంచింది. పంజాబ్ కు చెందిన 200 మంది కాబూల్‌లో ఉన్నారని, వారిని వెంట‌నే వెన‌క్కి తీసుకురావాల‌ని పంజాబ్ ముఖ్య‌మంత్రి విదేశాంగ శాఖ‌మంత్రిని విజ్ఞ‌ప్తి చేశారు.  

Read: రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న “భీమ్లా నాయక్”

Exit mobile version