Site icon NTV Telugu

Julian Assange: అస్సాంజేకి విముక్తి.. సుదీర్ఘ వివాదానికి ముగింపు..

Julian Assange

Julian Assange

Julian Assange: అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాల రహస్యాలను వెల్లడించి సంచలనం సృష్టించిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకి విముక్తి లభించింది. అమెరికాకు చెందిన పసిఫిక్ ద్వీప భూభాగంలోని సైపాన్ లోని బుధవారం విడుదల చేసింది. అతను స్వదేశం ఆస్ట్రేలియాకు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. మూడు గంటల విచారణ సమయంలో, అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందేందుకు, బహిర్గతం చేయడానికి కుట్ర పన్నినట్లుగా నేరారోపణను అసాంజే అంగీకరించాడు. అయితే, వాక్ స్వాతంత్ర్యాన్ని రక్షించే రాజ్యాంగం తనకు రక్షణగా ఉంటుందని తాను నమ్ముతున్నానని చెప్పాడు.

వాక్ స్వాతంత్ర్యాన్ని నమ్ముతానని, అయితే అది గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించిందని తాను అంగీకరిస్తున్నట్లు అసాంజే కోర్టుకు తెలిపారు. అమెరికా న్యాయ విభాగంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, గూఢచర్యం ఆరోపణలను అంగీకరించడంతో యూఎస్ డిస్ట్రిక్ట్ చీఫ్ జడ్జ్ రమొనా వి. మంగ్లోవా, అసాంజే బ్రిటన్‌లో నిర్బంధంలో ఉన్న కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ విడుదల చేస్తున్నట్లు తీర్పు చెప్పారు.

Read Also: IND Playing 11: స్టార్ ఆటగాడిపై వేటు.. సంజూకు చోటు! ఇంగ్లండ్‌తో ఆడే భారత్ తుది జట్టు ఇదే

అంతకుముందు యూకే, యూఎస్, ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి 52 ఏళ్ల అసాంజే ఆస్ట్రేలియాకు బయలుదేరారు. మార్గం మధ్యలో పశ్చిమ పసిఫిక్ లోని యూఎస్ భూభాగం సైపాన్‌లో విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట భార్య స్టెల్లా అసాంజే ఉన్నారు. ఆస్ట్రేలియాలో జన్మించిన ప్రస్తుతం సొంత దేశానికి వెళ్తున్నారు. గూఢచర్యం ఆరోపణలతో 5 ఏళ్లు జైలులో గడిపారు. అంతకుముందు ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు.

ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌లలో జరిగిన సంఘర్షణల్లో అమెరికా తప్పుల్ని అసాంజే బహిర్గతం చేయడం సంచలనం రేపింది. రహస్య పత్రాలను బయటపెట్టడంతో అతడి జీవితం ప్రమాదంలో పడింది. అతని విడుదల కోసం ఆస్ట్రేలియ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ కేసులో అసాంజే విడుదలను ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ స్వాగతించారు. సున్నితమైన అంశమైన నేపథ్యంలో దీనిపై మరింత వ్యాఖ్యలు చేయలేదనని చెప్పారు.

Exit mobile version