Site icon NTV Telugu

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ టీకాతో డెల్టావేరియంట్‌కు చెక్‌…ఏడాది త‌రువాత‌…

డెల్టా వేరియంట్ వంద‌కు పైగా దేశాల్లో వ్యాపించింది.  మిగతా వేరియంట్ల కంటే ఈ డెల్టా వేరియంట్ తీవ్ర‌త అధికంగా ఉన్న‌ట్టు ఇప్ప‌టికే నిర్ధార‌ణ జ‌రిగింది.  ప్ర‌స్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఎంత వ‌ర‌కు ప్ర‌భావం చూపుతున్నాయి.  ఎంత వ‌ర‌కు మ‌హ‌మ్మారిని కంట్రోల్ చేస్తుంది అనే దానిపై స్ప‌ష్టత రావాల్సి ఉన్న‌ది.  అమెరికాకు చెందిన జాన్స‌న్ అండ్ జాన్స‌న్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  అన్ని వ్యాక్సిన్లు రెండు డోసుల వ్యాక్సిన్లు కాగా, జాన్స‌న్ అండ్ జాన్స‌న్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కావ‌డం విషేషం.

Read: నటన, సమాజసేవను బ్యాలెన్స్ చేస్తున్న గౌతమి

ఈ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొని న్యూట్ర‌లైజ్ చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.  డెల్టాతో పాటుగా ఇత‌ర వేరియంట్ల‌పై కూడా వ్యాక్సిన్లు స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేస్తున్నాయ‌ని అన్నారు.  సింగిల్ డోస్ టీకాతో 8 నెల‌ల పాటు యాంటీబాడీలు శ‌రీరంలో ఉత్ప‌త్తి అవుతాయని, ఏడాది త‌రువాత మ‌రోసారి సింగిల్ బూస్ట‌ర్ డోస్ తీసుకుంటే, అత్య‌ధిక కాలంపాటు ర‌క్ష‌ణ ఉంటుంద‌ని జాన్స‌న్ అండ్ జాన్స‌న్ సంస్థ చెబుతున్న‌ది. 

Exit mobile version