NTV Telugu Site icon

Joe Biden: యూఎస్ ప్రెసిడెంట్ కు మరోసారి కోవిడ్ పాజిటివ్

Joe Biden

Joe Biden

US President Joe Biden tests Covid-19 positive: యూఎస్ఏ ప్రెసిడెంట్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అధ్యక్ష నివాసం వైట్ హౌజ్ లో ఐసోలేషన్ లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు బైడెన్. ఇప్పటికే ఓ సారి కరోనా బారిన పడ్డ బైడెన్ మరోసారి ఇటీవల కరోనాకు గురయ్యారు. ఇప్పటికే ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ ప్రికాషనరీ, బూస్టర్ డోసులను కూడా తీసుకున్నారు. అయినా కూడా ఇటీవల మళ్లీ కరోనా బారినపడ్డారు.

ఇదిలా ఉంటే జోబైడెన్ శనివారం మళ్లీ కోవిడ్ పరీక్ష చేయించుకోగా.. మళ్లీ పాజిటివ్ ఫలితమే వచ్చింది. బైడెన్ తన ఐసోలేషన్ పూర్తి చేస్తున్న మూడు రోజుల తర్వాత పరీక్షల్లో మరోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. అత్యంత అరుదుగా కరోనా వైరస్ తిరుబెట్టే సందర్భాల్లో ఇది ఒకటని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. వైట్ హౌజ్ డాక్టర్ కెవిన్ ఓకానర్ మాట్లాడుతూ.. అధ్యక్షుడికి ఎలాంటి లక్షణాలు లేవని బాగానే ఉన్నాడని వెల్లడించారు. మళ్లీ పాజిటివ్ రావడంతో జో బైడెన్ ఐదు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండనున్నారు.
Read Also: Chinese Rocket: తప్పిన గండం.. హిందూ మహాసముద్రంలో కూలిన చైనా రాకెట్

79 ఏళ్ల బైడెన్ జూలై 21న కోవిడ్ బారిన పడ్డారు. అప్పటి నుంచి యాంటీ వైరల్ డ్రగ్ పాక్స్ లోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే గత మంగళవారం, బుధవారం ఆయనకు కోవిడ్ పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. తాజాగా శనివారం జరిగిన యాంటిజెన్ పరీక్షలో పాజిటివ్ గా తేలింది. సాధారణం ఇది రీ బౌండ్ ఇన్ఫెక్షన్ ను సూచిస్తుంది. ఇప్పటికే అమెరికా ప్రపంచంలోనే అధిక కోవిడ్ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో మొదటిస్థానంలో ఉంది. మరణాలు కూడా అమెరికాలోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అమెరికాకు చెందిన ప్రజాప్రతినిధులు ఇప్పటికే కోవిడ్ బారిన పడ్డారు. గతంలో వైట్ హౌజ్ సిబ్బంది కూడా గణనీయంగా కోవిడ్ వ్యాధి బారినపడ్డారు.

Show comments