NTV Telugu Site icon

Joe Biden: పుతిన్ పెద్ద తప్పు చేశారు..

Joe Biden

Joe Biden

Joe Biden: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపధ్యంలో సోమవారం అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించారు. అధ్యక్షుడు జెలన్ స్కీతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. అయితే దీనిపై రష్యా మండిపడింది. యుద్ధానికి కారణం పాశ్చత్య దేశాలే అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్వార్థానికి ఉక్రెయిన్, రష్యాలను బలిపశువు చేశారంటూ మండిపడ్డారు. ఈ నేపధ్యంలో రష్యా, అమెరికాల మధ్య చివరిసారిగా కుదిరిన అణు ఒప్పందం ‘న్యూ స్టార్ట్’ నుంచి రష్యా తాత్కాలికంగా వైగొలుగుతున్నట్లు ప్రకటించింది.

Read Also: Bill Gates: భారతదేశం నాకు భవిష్యత్తుపై ఆశ కల్పిస్తోంది.

ఇదిలా ఉంటే పోలాండ్ లో ఉన్న జో బైడెన్, రష్యా నిర్ణయంపై స్పందించారు. రష్యా తీసుకున్న నిర్ణయం పెద్ద తప్పిదం అని, పుతిన్ పెద్ద తప్పు చేశారని అన్నారు. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ కు మద్దతుపై నాటో దేశాలతో చర్చించారు. ‘బూకారెస్ట్-9’ దేశాాలుగా పిలువబడే నాటో కూటమి దేశాల అధినేతలతో బైడెన్ సమావేశం అయ్యారు. ఎలాంటి క్లిష్ట సమయాల్లో అయిన అమెరికా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రష్యా, ఉక్రెయిన్ పై విజయం సాధిస్తే తమపై కూడా సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని బుకారెస్ట్-9 దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

న్యూ స్టార్ట్ అణు ఒప్పందం చివరిసారిగా జరిగిన అణు ఒప్పందం. న్యూ స్టార్ట్ అంటే (స్ట్రాటజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రిటీ) 2010లో అప్పటి యూఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు ద్వెమిత్రి మెద్వదేవ్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. 2011 నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం కాలపరిమితి ముగిసినా కొద్దీ మళ్లీ ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు తమ అణు ఆయుధాలను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి. దీని ప్రకారం ఇరు దేశాలు క్షిపణులు, బాంబర్లను 700కు, వార్ హెడ్స్ ను 1550కి తగ్గించాలని నిర్ణయించాయి.

Show comments