NTV Telugu Site icon

US Debt Ceiling Crisis: కుదరని ఏకాభిప్రాయం.. ఆర్థిక సంక్షోభం అంచున అమెరికా..

Usa

Usa

US Debt Ceiling Crisis: అమెరికా ఆర్థిక సంక్షోభం అంచున నిలిచింది. అమెరికా రుణపరిమితి పెంచడంపై అధికార డెమోక్రాట్స్, విపక్ష రిపబ్లికన్ల మధ్య ఒప్పదం కుదరలేదు. రుణపరిమితి పెంపుపై అధ్యక్షుడ జో బైడెన్, స్పీకర్ కెవిన్ మెకార్థీల మధ్య సోమవారం రాత్రి చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో అంగీకారం కుదరలేదున. జోబైడెన్ డెమెక్రాటిక్ పార్టీకి చెందిన వారు కాగా.. మెకార్థీ రిపబ్లికన్ పార్టీకి చెందినవారు. ప్రస్తుతం కాంగ్రెస్ దిగువసభలో రిపబ్లికన్లకే ఆధిక్యత ఉంది. సెనెట్‌లో డెమెక్రాట్లకు ఆధిక్యత ఉంది.

Read Also: MLA RK: విదేశాల్లో ఉన్నందుకే నాపై దుష్ప్రచారం.. రాజకీయాల్లో ఉంటే జగన్‌ తోనే..!

జూన్ 1 నాటి కల్లా రుణ పరిమితి పెంచకపోతే అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఫించన్లతో సహా విదేశాల కొనుగోలు చేసి బాండ్లకు చెల్లింపులు నిలిచిపోతాయి. ఇదే జరిగితే అమెరికాలో ఆర్థిక సంక్షోభం తప్పకపోవచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా దెబ్బతీసే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి జెనెట్ యెలెన్ ఇటీవల కాంగ్రెస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం ఎక్కువ రుణాలు తీసుకునేందుకు అనుమతిస్తే ప్రతిగా డెమోక్రాట్లు తమ విధానాలను మార్చుకోవాలని రిపబ్లికన్లు కోరుతున్నారు. దీనికి అధికార డెమెక్రాట్ సిద్ధంగా లేదు.

వార్షిక బడ్జెట్ నిధుల కేటాయింపులో ఒక శాతం కోత పెట్టి ఆరేళ్ల పాటు డబ్బు ఆదా చేయాలని రిపబ్లికన్లు భావిస్తుంటే.. అధ్యక్షుడు బైడెన్ మాత్రం 2023 బడ్జెట్ లాగే 2024 బడ్జెట్ ను కొనసాగిస్తామని అంటున్నారు. 2025 బడ్జెట్ వ్యయాన్ని 1 శాతానికి మించి పెంచబోమని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది రక్షణ, రక్షణేతర వ్యాయాలను 2023 స్థాయిలోనే కొనసాగిస్తే 9000 కోట్ల డాలర్లు, పదేళ్లలో లక్ష కోట్ల డాలర్లు మిగులుతాయాని డెమెక్రాట్లు వాదిస్తున్నారు. అత్యంత సంపన్నులపైన, కొన్ని బడా కంపెనీలపైన పన్నులు పెంచడం ద్వారా బడ్జెట్ లోటును కొంతవరకు భర్తీ చేయవచ్చని బైడెన్ ప్రతిపాదించగా.. మెకార్థీ దీనికి ఒప్పుకోలేదు.