Joe Biden: డర్టీ బాంబ్ రచ్చ.. రష్యాకి బైడెన్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Biden Gives Strong Warning To Russia Over Dirty Bomb: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌పై అణు బాంబును ప్రయోగిస్తే.. రష్యా క్షమించరాని తప్పిదం చేసినట్లే అవుతుందని హెచ్చరించారు. డర్టీ బాంబ్(అణు బాంబ్)పై రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో.. మంగళవారం వైట్ హౌస్‌లో మాట్లాడుతూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అణుబాంబుల గురించి వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో తనకు తెలియదన్న జో బైడెన్.. ఒకవేళ ఉక్రెయిన్‌పై రష్యా డర్టీ బాంబ్ ప్రయోగిస్తే మాత్రం ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు.
కాగా.. ఇటీవల ఐరోపాలోని అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రంలో రష్యా రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తోందని ఉక్రెయిన్ న్యూక్లియన్ ఎనర్జీ ఆపరేటర్ ఆరోపిణలు చేయగా, ఉక్రెయినే డర్టీ బాంబ్ ప్రయోగించేందుకు సిద్ధమవుతోందని రివర్స్‌లో రష్యా ఆరోపించింది. తాము స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ ప్రాంతంలో దాడి చేసేందుకు రెడీ అవుతోందని.. సొంత ప్రజలపైనే అణుబాంబు ప్రయోగించి, దాన్ని తమ మీద తోసేందుకు కుట్ర పన్నుతోందని రష్యా తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాము ఖేర్సన్ నుంచి తమ బలగాలను ఖాళీ చేయిస్తున్నామని.. డర్టీ బాంబ్ విషయంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తేల్చుకుంటామని పేర్కొంది. అయితే.. రష్యా చేసిన ఈ ఆరోపణలను నాటో దేశాలు ఖండించాయి. యుద్ధంలో ఉద్రిక్తతలను పెంచేందుకే.. రష్యా ఈ తరహా ఆరోపణలకు దిగిందని మండిపడ్డాయి.
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ఇదిలావుండగా.. ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా, ఈమధ్య ఉక్రెయిన్‌పై దాడులు మరింత తీవ్రతరం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మిలిటరీ మొబిలైజేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే రష్యా-క్రిమియా బ్రిడ్జిపై ఉక్రెయిన్ దాడులు చేయడంతో.. అందుకు ప్రతీకారంగా రష్యా భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో కీవ్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, కీలక భవనాలు ధ్వంసమయ్యాయి. కొంతమంది చనిపోగా.. చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు.
తాజావార్తలు
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!