Joe Biden Announces 2024 Election Bid: 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని.. ఆ అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ.. తన ట్విటర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తనను మరోసారి ఎన్నుకోవాలని, దేశానికి సేవ చేసేందుకు మరింత సమయం ఇవ్వాలని ఆయన అమెరికా ప్రజల్ని కోరారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం వచ్చే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ‘‘ప్రజాస్వామ్యం కోసం ప్రతి తరం వారు నిలబడాల్సిన క్షణం ఒకటి ఉంటుంది. ప్రాథమిక స్వేచ్ఛ కోసం అందరూ ఐక్యంగా ఉండాలి. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందని నేను నమ్ముతున్నాను. అందుకే.. అమెరికా అధ్యక్ష పదవి కోసం నేను మరోసారి పోటీ పడుతున్నాను. నాకు మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నా’’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Naredra Modi: మోడీజీ, పాకిస్తాన్‌ని దత్తత తీసుకోండి.. పాక్ బ్లాగర్ రిక్వెస్ట్
‘అమెరికా గురించి నాకు బాగా తెలుసు. ఈ దేశపు ప్రజలందరూ మంచి హృదయం కలిగినవారు. నిజాయితీ, గౌరవాన్ని నమ్మే అమెరికన్లం. అందరూ ఆత్మగౌరవంతో పలకరించుకుంటాం. అందరూ సమానమేనని నమ్ముతాం. ఈ దేశంలో సక్సెస్ సాధించడానికి ప్రతి ఒక్కరికీ అవకాశాలు లభించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి తరం వారు ఏదో ఒక క్షణంలో పోరాడి ఉంటారు. ప్రాథమిక స్వేచ్ఛ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలబడాలి. పౌర హక్కుల కోసం నిలబడండి. ఇదే ఆ మూమెంట్’’ అంటూ ఆ వీడియోలో జో బైడన్ చెప్పుకొచ్చారు. కాగా.. 2024 నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరగనున్నాయి. ఈ అధ్యక్ష ఎన్నికలు జరగడానికి ముందు.. ఆయా పార్టీల్లో తుది అభ్యర్థుల కోసం ప్రైమరీ ఎన్నికలు జరుగుతాయి. అయితే.. అధ్యక్షుడే రెండోసారి పోటీకి దిగుతానని ప్రకటించాడు కాబట్టి, ఆ ప్రైమరీ ఎన్నికలు ఉండకపోవచ్చు. మరోవైపు.. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తరఫున తాను పోటీ చేయాలని అనుకుంటున్నానని ఇప్పటికే డొనాల్ట్ ట్రంప్ ప్రకటించాడు. దీంతో.. 2020లో పోటీ పడిన ట్రంప్, బైడెన్.. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారన్నమాట. మరో ట్విస్ట్ ఏమిటంటే.. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ రాన్ డిశాంటిస్ కూడా బరిలో దిగే అవకాశాలు బలంగా ఉన్నాయి.
Raai Laxmi: లో యాంగిల్ లో ఎద అందాలను అంత దగ్గరగా చూపిస్తే ఎట్టా రత్తాలు
అయితే.. ఈసారి జో బైడెన్‌ని అమెరికా ప్రజలు ఎన్నుకుంటారా? లేదా? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఇందుకు కారణం.. ఆయన వయసే. ప్రస్తుతం ఆయన వయసు 81 సంవత్సరాలు. ఒకవేళ బైడెన్ రెండోసారి విజయం సాధించి, తన పదవీకాలం పూర్తి చేసేనాటికి 86 ఏళ్లకు చేరుకోనున్నారు. దీంతో.. వయసు రీత్యా ఆయనకు అమెరికన్లు మరో అవకాశం ఇస్తారా లేదా అనేది సందిగ్ధంగానే ఉంది. దీనికితోడు.. ఈ ఏడాది మొదట్లో బైడెన్ రహస్య పత్రాల వివాదంలోనూ చిక్కుకున్నారు. ఇప్పటికే ఈ వివాదం ఆయనపై ఎంతో ప్రభావం చూపింది. రాబోయే ఎన్నికల్లోనూ ఇది ప్రభావం చూపే అవకాశం తప్పకుండా ఉండనే ఉంటుంది.