NTV Telugu Site icon

Jeo Biden: హమాస్ కంటే.. ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య డీల్‌ సెట్ చేయడమే సులభం..

Biden

Biden

Jeo Biden: పశ్చిమాసియాలో సంఘర్షణను తగ్గించడానికి చర్చలు జరిపిన తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హాట్ కామెంట్స్ చేశారు. ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేయడం కన్నా.. ఇజ్రాయెల్‌- హెజ్‌బొల్లా మధ్య డీల్‌ సెట్ చేయడమే సులభం అన్నారు. శుక్రవారం బెర్లిన్‌లో జరిగిన సమావేశానికి హాజరైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని కీర్ స్టార్మర్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్‌, జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌.. ఆ తర్వాత బైడెన్‌ మాట్లాడుతూ.. పైవిధంగా వ్యాఖ్యనించారు.

Read Also: Yahya Sinwar: హమాస్‌ చీఫ్ సిన్వార్‌ పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు

ఇక, మధ్యప్రాచ్య దేశాలలో సంఘర్షణను ముగించే మార్గం గురించి తాము ప్రధానంగా చర్చించాం అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలను కొంత కాలం పాటు నిలిపివేసేందుకు మా దగ్గర ఓ ప్లాన్ ఉందని చెప్పారు. దాన్ని మా మిత్ర దేశాలు కూడా ఒప్పుకున్నాయి.. ఇక, ప్రస్తుతం జరుగుతున్న చర్చల నేపథ్యంలో లెబనాన్‌తో ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం త్వరలోనే సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తుంది.. కానీ, గాజాపై మాత్రం సయోధ్య కుదరడం కష్టంగా కనబడుతుందన్నారు. అయినా కూడా ఈ చర్చలతో తప్పకుండా ఫలితం ఉంటుందని భావిస్తున్నామని జో బైడెన్‌ వెల్లడించారు.

Show comments