Japanese Military Helicopter Crashes In Sea With 10 Member On Board: కనిపించకుండా పోయిన జపాన్ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిందని సమాచారం. అది మియాకో, ఇరాబు మధ్య సముద్రజలాల్లో కూలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆ హెలికాప్టర్ అదృశ్యమైన వెంటనే సహాయక బృందం రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా.. దానికి చెందిన లైఫ్‌బోట్, ఒక తలుపుతో పాటు పలు విభాగాల్ని కనుగొన్నారు. దీంతో.. అది కుప్పకూలినట్టు నిర్ధారణకు వచ్చారు. అందులో డివిజన్ కమాండర్‌తో కలిపి ఉన్న 10 మంది సిబ్బంది గల్లంతు అయ్యారు. వారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. గల్లంతైన వారిలో ఎవరూ ప్రాణాలతో ఉండేందుకు అవకాశం లేదంటూ జపాన్ రక్షణ మంత్రి యసుకాజు హమదా మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని, నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యామని చెప్పారు.
Food Meets Fame: తెర మీదే కాదు.. బిజినెస్లో కూడా తారలే
కాగా.. చైనా నుంచి ఎదురవుతున్న భద్రతాపరమైన సవాళ్ల నేపథ్యంలో, జపాన్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో రక్షణ సన్నద్ధత కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా.. జపాన్ దక్షిణ దీవుల్లో కుమమోటో నుంచి ఒక బ్లాక్‌హాక్ సైనిక హెలికాప్టర్ బయలుదేరింది. మియాకోజిమాలోని గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ స్థావరం నుంచి వెళ్లిన ఈ హెలికాప్టర్, సాయంత్రం 4:30 గంటల సమయంలో అదృశ్యం అయ్యింది. రాడార్ ట్రాకింగ్ నుంచి సంబంధాలు తెగిపోవడంతో పాటు రేడియో కమ్యునికేషన్‌లకు స్పందించలేదు. దాంతో.. ఆ విమానం సమాచారాన్ని సేకరించడం కోసం గ్రౌండ్ సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్‌లు రంగంలోకి దిగాయి. దీని ఆచూకీ కనుగొని, అందులో ఉన్న 10 మంది సిబ్బందిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ.. ఇంతలోనే ఈ ఘోరం వెలుగుచూడటంతో జపాన్ రక్షణ మంత్రి యసుకాజు భావోద్వేగానికి లోనయ్యారు. గల్లంతైన వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Drunk IndiGo Passenger: విమానంలో తాగుబోతు వీరంగం.. ఆ పని చేయబోయి అరెస్ట్