NTV Telugu Site icon

Japan Offer: టోక్యోని వీడండి.. లక్షలు కొట్టేయండి.. జపాన్ ప్రభుత్వం ఆఫర్

Japan Govt Offers 1m

Japan Govt Offers 1m

Japanese Government Offers Families 1M Yen A Child To Leave Tokyo: నగరాల్లో ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉంటాయి. కూలీ పని చేసుకోవడం దగ్గర నుంచి లక్షల్లో జీతాలు అందుకునే పెద్ద ఉద్యోగాలు దాకా.. నగరాల్లో అందుబాటులో ఉంటాయి. దీనికితోడు జీవన విధానం కూడా వృద్ధి చెందుతుంది. అందుకే.. మారుమూల ప్రాంతాల నుంచి జనాలు నగరాలకు పోటెత్తుతుంటారు. జపాన్‌లోని టోక్యో విషయంలోనూ అదే జరుగుతోంది. ఆ నగరంపై అయితే జనాలు దండయాత్ర చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి, అక్కడ బస చేస్తున్నారు. దీంతో.. అక్కడ ఇబ్బడిముబ్బడిగా జనాలు పెరిగిపోతోంది. ప్రస్తుతం 3.80 కోట్లకు పైగా జనాభా కలిగిన టోక్యో.. ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా రికార్డులకెక్కింది.

Loan App Harassment: లోన్‌ యాప్‌ వేధింపులు.. మరో యువకుడు బలి

ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది కానీ.. టోక్యోకు జనాలు పోటెత్తుతుండటం వల్ల, మిగిలిన పట్టణాల్లో జనాభా తగ్గిపోతోంది. దాంతో ఆ పట్టణాలు సంక్షోభవంలోకి వెళ్లిపోతున్నారు. జనం లేక అక్కడి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఫలితంగా.. ఆస్తుల విలువ దారుణంగా పడిపోతోంది. ఈ సమస్యని గుర్తించిన జపాన్ ప్రభుత్వం.. ఇతర నగరాల్ని సంక్షోభంలో నుంచి బయటపడేసేందుకు, టోక్యో నుంచి వలసల్ని ప్రోత్సాహించేందుకు ఒక వినూత్నమైన వ్యూహానికి తెరతీసింది. ఎవరైతే టోక్యో నగరాన్ని వీడుతారో.. వారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. గతంలోనే జపాన్ ప్రభుత్వం.. టోక్యోను వీడే ఒక్కో కుటుంబంలోని బిడ్డకు 3 లక్షల యెన్ చొప్పున ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు అదే ఆఫర్‌ని 10 లక్షల యెన్ (దాదాపు రూ. 6.35 లక్షలు)లకు పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ కొత్త ఆఫర్ అమల్లోకి రానుంది.

Love is Crazy: దానికి ఒప్పుకోలేదని.. ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్మాది..

జననాల రేటు తక్కువగానూ, వద్ధులు ఎక్కువగానూ ఉన్న ప్రాంతాలకు టోక్యో నుంచి కుటుంబాలు తరలివెళ్లేందుకు.. జపాన్ ప్రభుత్వం 2019 నుంచి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఒకరికంటే ఎక్కువమంది పిల్లలున్న కుటుంబానికి గతంలో 30 లక్షల యెన్‌‌ల వరకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఒక్కో బిడ్డకు 3 లక్షల యెన్‌లు చెల్లించింది. ఏయే ప్రాంతాలకైతే వెళ్తారో, అక్కడ సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు కూడా ఆర్థిక సహాయం అందించింది. అయినప్పటికీ.. టోక్యోలో జనాభా తగ్గుముఖం పట్టలేదు. 2021లో కేవలం 2,400 కుటుంబాలు మాత్రమే టోక్యోను వీడాయి. అందుకే.. జపాన్ ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని 3 లక్షల యెన్ నుంచి 10 లక్షల యెన్‌కి పెంచింది. మరి, దీని వల్ల అయినా మార్పులొస్తాయో లేదో చూడాలి.

Drunken Man: మత్తులో విద్యార్థి వీరంగం.. మూడు వాహనాల్ని ఢీ.. ట్విస్ట్ ఏంటంటే?