Japan PM Kishida Visits Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఉక్రెయిన్ లో ఆకస్మిక పర్యటన చేశారు. ప్రధాని కిషిడా ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించారు. ఈ నెలలో 19 నుంచి 21 వరకు ఆయన భారత్ లో పర్యటించారు. ఇదే దేశాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. ఆ తరువాత ఆయన ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ప్రభుత్వ విమానంలో కాకుండా చార్టెడ్ విమానంలో పోలాండ్ చేరుకున్నారు. ఆదివారం రాత్రి జపాన్ రాజధాని టోక్యోలోని హనెడా విమానాశ్రయం నుంచి బయలుదేరిని విమానం పోలాండ్ చేరుకుంది. అక్కడ నుంచి ఆయన ఉక్రెయిన్ కీవ్ కు చేరుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ఆయన సమావేశం అయ్యారు.
Read Also: IND vs AUS : ఆసీస్ తో మూడో వన్డేకు సిద్ధం.. సిరీస్ పై కన్నేసిన భారత్
చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ రష్యా పర్యటనలో ఉన్న సమయంలో జపాన్ ప్రధాని కిషిడా ఉక్రెయిన్ ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ కిషిడా పర్యటనను చారిత్రాత్మకమైనదిగా వర్ణించింది. ఉక్రెయిన్ కు సంఘీభావం, బలమైన సహకారానికి సంకేతం అని పేర్కొంది. రష్యా దురగాతాలకు కేంద్రమైన బూచా పట్టణాన్ని కిషిడా సందర్శించారు. రష్యన్ బలగాలు బుచా పట్టణంలో ప్రజలను ఊచకోత కోసిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. అయితే దీన్ని రష్యా కొట్టిపారేస్తోంది. ప్రస్తుత యుద్ధంలో జపాన్ ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తోంది. రష్యాపై ఆంక్షలు కూడా విధించింది. మరోవైపు జిన్ పింగ్ రష్యా పర్యటనలో అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యారు. వీరి మధ్య యుద్ధమే ప్రధాన అంశంగా మారిందని తెలుస్తోంది.