Site icon NTV Telugu

Drink More Alcohol: మద్యం తాగండి ప్లీజ్‌.. సర్కార్‌ రిక్వెస్ట్..!

Alcohol

Alcohol

మద్యం ఆరోగ్యానికి హానికరం.. దానికి దూరంగా ఉండండి అని చెబుతారు.. అయితే, కొన్ని ప్రభుత్వాలు ఇప్పుడు మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంపై నడుస్తున్నాయి అనేది ఓపెన్‌ సీక్రెట్‌.. ఇది భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకే పరిమితం అయ్యింది అనుకుంటే పొరపాటే.. ఇతర దేశాల్లో కూడా కొన్ని ప్రభుత్వాలు.. మద్యం అమ్మకాలపైనే ఆదారపడినట్టు స్పష్టం అవుతుంది. ఎందుకంటే.. రండీ..! మద్యం తాగండి అని యువతను రిక్వెస్ట్‌ చేస్తోంది జపాన్‌ ప్రభుత్వం.. లిక్కర్‌ ఆదాయం ప్రతీ ఏడాది భారీగా పడిపోవడంతో.. ఇప్పుడు మద్యం తాగండి అని ఆహ్వానిస్తోంది.. ఏకంగా పోటీలే పెడుతోంది..

Read Also: Ola Cabs Fined By Court: 4 కి.మీ. దూరానికి రూ.861 ఛార్జ్ చేసినందుకు రూ.95 వేలు జరిమానా

యువత ఎక్కువగా మద్యం తాగేలా ప్రోత్సహించేందుకు జపాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పోటీని ప్రారంభించింది. నివేదికల ప్రకారం, 31 సంవత్సరాలలో మద్యం పన్ను ఆదాయంలో జపాన్ ఇటీవల అతిపెద్ద పతనానికి గురైనందున.. మద్యం వినియోగాన్ని ప్రోత్సహించాలనే ప్రచారం చేస్తోంది.. ఇందుకోసం ‘సేక్‌ వివా’ పేరుతో నేషనల్‌ ట్యాక్స్‌ ఏజెన్సీ దేశవ్యాప్త పోటీ నిర్వహిస్తోంది. 20 – 39 ఏళ్ల మధ్య వయస్కులు ఇందులో పాల్గొనవచ్చు. యూత్‌లో మందు కొట్టే అలవాటును పెంచేందుకు ఏం చేయాలో వారు సలహాలు సూచనలు తీసుకోనున్నారు..ఈ పోటీ “కొత్త ఉత్పత్తులు మరియు డిజైన్‌లు” అలాగే మద్యపానాన్ని ప్రోత్సహించే మార్గాల కోసం పిలుపునిచ్చింది.. సెప్టెంబర్ 9 వరకు యూత్‌ నుంచి సలహాలు తీసుకోనుంది జపాన్‌ ప్రభుత్వం.. ఫైనలిస్టులను అక్టోబర్‌లో నిపుణుల కన్సల్టేషన్‌ కోసం ఆహ్వానిస్తారు. నవంబర్‌లో టోక్యోలో తుది రౌండ్‌ పోటీ ఉంటుంది. విజేత తన మద్యం అమ్మకాల పెంపు బ్లూప్రింట్‌ను అమలు చేసేందుకు ఏజెన్సీ పూర్తి సహాయ సహకారాలు అందజేయనుంది..

జపాన్‌లో 1995లో సగటున ఒక వ్యక్తి ఏడాదికి 100 లీటర్ల మద్యపానం 2020 నాటికి 75 లీటర్లకు పడిపోయిందని అధికారులు స్థానిక మీడియా ద్వారా పేర్కొన్నారు. జపనీస్ టైమ్స్ ప్రకారం, మద్యంపై పన్నులు జపాన్‌లో 5 శాతంగా ఉన్నాయి. 1980లో మొత్తం పన్ను రాబడి, 2011లో 3 శాతానికి పడిపోయింది.. 2020లో 1.7 శాతానికి తగ్గింది. మునుపటి సంవత్సరంతో పోలిస్తే.. 2020 ఆర్థిక సంవత్సరంలో మద్యంపై పన్ను ద్వారా వచ్చే మొత్తం ఆదాయం 110 బిలియన్ డాలర్లకు పడిపోయింది.. గత 31 ఏళ్లలో ఇదే అతి పెద్ద తగ్గుదల ఇదే కావడం.. మరోవైపు.. నిధుల లేమితో ఇబ్బందుల్లో ఉన్న జపాన్‌.. ఇప్పుడు మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడంపై ఫోకస్‌ పెట్టింది.. యువత మద్యం తాగేందుకు ఇష్టపడడం లేదనే విషయాన్ని గమనించిన సర్కార్.. వాటిని ప్రోత్సహించే పనిలోపడిపోయింది..

అయితే, జపాన్‌లోని యువతరం వారి తల్లిదండ్రుల కంటే తక్కువ ఆల్కహాల్ తీసుకుంటుండడమే ప్రభుత్వం తాజా చర్యలకు కారణంగా చెబుతున్నారు.. అది జపనీస్ కోసమైనా, షోచు, విస్కీ, బీర్ లేదా వైన్ ఇలా అన్ని అమ్మకాలు పడిపోయాయట.. దీనికి ప్రధానం కారణం కరోనా మహమ్మారి అని తేల్చారు.. కోవిడ్‌ ఎంట్రీతో జీవనశైలిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.. కొన్ని దేశాలో బీర్ల అమ్మకాలు తగ్గి లిక్కర్‌ అమ్మకాలు పెరిగాయి.. కానీ, జపాన్‌లో మద్యపానానికి అంతా దూరం అయిపోతున్నారట.. జపాన్‌లో ఆల్కహాల్ మార్కెట్ తగ్గిపోవడానికి దేశం యొక్క పాత జనాభా కూడా ఒక కారణంగా తేల్చారు.. దీంతో, యువతకు మద్యం తాగించేలా ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం.

Exit mobile version